Smart Phone Charging Mistakes : స్మార్ట్‌ఫోన్లు అనేవి ప్రస్తుతం మనకు మన దినచర్యలో భాగం అయ్యాయి. అవి లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాము. స్మార్ట్ ఫోన్ లేకుండా మనం అసలు ఏ పని చేయలేకపోతున్నాము. అంతలా అవి మన దైనందిన జీవితంలో భాగం అయ్యాయి. అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ కొందరు స్మార్ట్‌ఫోన్లకు చార్జింగ్ పెట్టే విషయంలోనే అనేక తప్పులు చేస్తుంటారు. దీని వల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక ఫోన్‌కు చార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్‌కు కొందరు చార్జింగ్ పెట్టిన తరువాత 100 శాతం చార్జింగ్ పూర్తయినా ఫోన్‌ను అలాగే చార్జింగ్ పెట్టి ఉంచుతారు. ఇలా చేయకూడదు. దీని వల్ల బ్యాటరీపై ప్రభావం పడుతుంది. దీంతో అది పేలిపోయే చాన్స్ ఉంటుంది. కనుక ఫోన్ చార్జింగ్ 100 శాతం పూర్తవగానే వెంటనే తీసేయాలి. దీంతో ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు. అలాగే కొందరు ఫోన్‌కు చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్ స్విచ్‌ను ఆన్‌లోనే ఉంచుతారు. దీని వల్ల చార్జింగ్ కేబుల్స్‌ను పిల్లలు నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంటుంది. దీంతో వారికి విద్యుత్ షాక్ తగులుతుంది. ఇటీవల ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. కనుక ఫోన్ చార్జింగ్ అయ్యాక చార్జర్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి. వీలుంటే చార్జర్‌ను ప్లగ్ నుంచి తీసేస్తే మంచిది. దీంతో ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు.
బ్యాటరీ సేవింగ్ యాప్స్ వద్దు..
ఇక ఫోన్‌కు వేడి ప్రదేశంలో చార్జింగ్ పెట్టకూడదు. దీని వల్ల అప్పటికే వేడిగా ఉండే బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఫోన్‌కు చల్లని వాతావరణంలోనే చార్జింగ్ పెట్టాలి. అలాగే కొందరు తక్కువ ధరకు వస్తాయని చెప్పి చీప్ క్వాలిటీ కలిగిన చార్జర్లు లేదా కేబుల్స్‌ను వాడుతారు. వీటి వల్ల ప్రమాదం జరిగే చాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎల్లప్పుడూ బ్రాండెడ్ చార్జర్లు లేదా కేబుల్స్‌నే వాడాలి. అలాగే బ్యాటరీని సేవ్ చేస్తాయని చెప్పి కొందరు బ్యాటరీ సేవింగ్ యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి వాడుతుంటారు. కానీ వాస్తవానికి వీటి వల్ల బ్యాటరీ సేవ్ కాదు సరికదా.. బ్యాటరీ వృథా అవుతుంది. కనుక ఇలాంటి యాప్స్‌ను వెంటనే తీసేయండి. బదులుగా ఫోన్‌లోనే డిఫాల్ట్‌గా ఉండే బ్యాటరీ ఆప్టిమైజేషన్ సెట్టింగ్స్‌ను వాడుకోండి. బ్యాటరీని సేవ్ చేయడంలో ఈ సెట్టింగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇక కొందరు ఫోన్‌కు చార్జింగ్ పెట్టి ఉంచే వీడియోలను చూస్తుంటారు. లేదా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారు. ఇలా అసలు చేయకూడదు. దీంతో బ్యాటరీ పేలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతగా అవసరం అనుకుంటే చార్జింగ్ తీసి ఫోన్‌ను వాడి అవసరం తీరాక మళ్లీ చార్జింగ్ పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి ప్రమాదం జరగదు. ఇలా కొన్ని రకాల జాగ్రత్తలను పాటించడం వల్ల ఫోన్‌లను మనం సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు.