Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Soya Cutlet : క‌ర‌క‌ర‌లాడే వేడి వేడి సోయా క‌ట్‌లెట్స్‌.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

D by D
January 25, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Soya Cutlet : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో కూర‌ల‌తో పాటు చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్నాక్ ఐట‌మ్స్ లో సోయా క‌ట్లెట్స్ కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ల‌తో చేసే ఈ క‌ట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. సాయంత్రం పూట వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ క‌ట్లెట్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ సోయా క‌ట్లెట్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సోయా క‌ట్లెట్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

వేడి నీళ్లు – 2క‌ప్పులు, మీల్ మేక‌ర్ – ఒక కప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప‌లు – 2, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – పావు క‌ప్పు, బ్రెడ్ క్రంబ్స్ – ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Soya Cutlet recipe make in this way
Soya Cutlet

సోయా క‌ట్లెట్స్ త‌యారీ విధానం..

ముందుగా వేడి నీళ్లల్లో ఉప్పు వేసిక‌ల‌పాలి. త‌రువాత మీల్ మేక‌ర్స్ వేసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. తరువాత వీటిని చేత్తో నీరంతా పోయేలా పిండి జార్ లో వేసుకోవాలి. ఈ మీల్ మేక‌ర్ ల‌ను మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత బియ్యం పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీటిని వేసుకుని అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి.

ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుంటూ క‌ట్లెట్ ల ఆకారంలో వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు క‌ట్లెట్ ల‌ను మైదాపిండి మిశ్ర‌మంలో ముంచి ఆ త‌రువాత బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. త‌రువాత ఈ క‌ట్లెట్ ను వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సోయా క‌ట్లెట్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా త‌యారు చేసిన క‌ట్లెట్స్ ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Soya Cutlet
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tea And Coffee : రోజూ టీ, కాఫీల‌కు బ‌దులుగా ఈ ఆరోగ్య‌క‌ర‌మైన డ్రింక్స్‌ను తాగండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.