Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Spicy Aloo Fry : రంగు రుచి క‌ర‌క‌ర‌లాడుతూ ప‌ర్‌ఫెక్ట్‌గా రావాలంటే ఆలు ఫ్రైని ఇలా చేయండి..!

D by D
January 7, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Spicy Aloo Fry : బంగాళాదుంప‌ల‌తో మనం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒక‌టి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టుగా వివిధ ర‌కాలుగా ఆలూ ఫ్రైను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఆలూ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ ఫ్రై పొడి పొడిగా, క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా, క్రిస్పీగా ఆలూ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – 3( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ధ‌నియాలు- ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Spicy Aloo Fry recipe make like this for taste
Spicy Aloo Fry

ఆలూ ఫ్రై త‌యారీ విధానం..

ముంద‌గా బంగాళాదుంప‌ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వీటిని నీటిలో వేసి 2 నుండి 3 సార్లు బాగా క‌డ‌గాలి. త‌రువాత వీటిని ఉప్పు నీటిలో వేసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మిరియాలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో మ‌రో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి.

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌రకు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తిన్నా లేదా ప‌ప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Spicy Aloo Fry
Previous Post

Drinking Water Tips : నిల‌బ‌డి ఎల్ల‌ప్పుడూ నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.. కూర్చునే తాగాలి.. ఎందుకంటే..?

Next Post

Keep Warm In Winter : ఈ 10 ర‌కాల ప‌దార్థాల‌ను చ‌లికాలంలో తీసుకోండి.. శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.