Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Teenmar Dosa : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే తీన్మార్ దోశ‌.. ఇలా వేస్తే మొత్తం తినేస్తారు..!

D by D
September 1, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Teenmar Dosa : మ‌నం మ‌న అభిరుచికి త‌గినట్టు వివిధ రుచుల్లో దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే మ‌న‌కు హోట‌ల్స్, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద కూడా దోశ‌లు ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే వెరైటీ దోశ‌ల‌ల్లో తీన్మార్ దోశ కూడా ఒక‌టి. ఈ దోశ చాలా క‌ల‌ర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ‌ను ఒక‌టి తింటే చాలు మ‌న క‌డుపు నిండి పోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ఈ తీన్మార్ దోశ‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్కసారి ఈ తీన్మార్ దోశ‌ను తింటే చాలు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ తీన్మార్ దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తీన్మార్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క్యాబేజి తురుము – ఒక క‌ప్పు, క్యారెట్ తురుము – ఒక క‌ప్పు, ఉడికించి స్వీట్ కార్న్ – ఒక క‌ప్పు, ప‌నీర్ తురుము – అర క‌ప్పు, బ‌ట‌ర్ – ఒక టీ స్పూన్, బీట్ రూట్ తురుము – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Teenmar Dosa recipe in telugu make in this method
Teenmar Dosa

దోశ కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన ఎండుమిర్చి – 10, ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటాలు – 3, వెల్లుల్లి రెబ్బ‌లు – 2, ఉప్పు – త‌గినంత‌, బెల్లం – ఒక చిన్న ముక్క‌, నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

ఆలూ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, స‌న్న‌గా పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప‌లు – 3, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

తీన్మార్ దోశ త‌యారీ విధానం..

ముందుగా దోశ కారం త‌యారు చేసుకోవ‌డానికి ఒక జార్ లో నాన‌బెట్టిన ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటాలు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు, బెల్లం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో కలుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఆలూ మ‌సాలా త‌యారు చేసుకోవ‌డానికి ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి.

త‌రువాత బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకుని 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. త‌రువాత నూనె వేసి టిష్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి. ఇప్పుడు దోశ‌పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి. దోశ కొద్దిగా కాలిన త‌రువాత కొద్దిగా ఉల్లిపాయ ముక్క‌లు, క్యాబేజి తురుము, క్యారెట్ తురుము, దోశ కారం, ఆలూ మ‌సాలా, స్వీట్ కార్న్, ప‌నీర్ తురుము వేసి స్మాష్ చేసుకోవాలి. త‌రువాత దీనిని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత బ‌ట‌ర్, బీట్ రూట్ తురుము, చీస్ వేసుకోవాలి. దోశ చ‌క్క‌గా కాలిన త‌రువాత మ‌డ‌త పెట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి. లేదంటే రెండు ప‌క్క‌ల ఉండు అంచుల‌ను క‌ట్ చేసుకుని దోశ‌ను మూడు ముక్క‌లుగా క‌ట్ చేసుకుని రోల్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తీన్మార్ దోశ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా మ‌రింత రుచిగా కూడా ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Teenmar Dosa
Previous Post

Appadam Mixture : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే అప్ప‌డం మిక్చ‌ర్‌.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Next Post

Juices For Cholesterol : కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. ఈ జ్యూస్‌ల‌లో రోజూ ఏదో ఒక దాన్ని తాగండి చాలు..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.