Signs : ప్రస్తుత ప్రపంచంలో డబ్బు ప్రతి ఒక్కరికీ ఎంత ఆవశ్యకం అయిందో అందరికీ తెలిసిందే. డబ్బు మీదే ఈ ప్రపంచం నడుస్తుందని చెప్పవచ్చు. డబ్బు లేనిదే అసలు ఏ పనీ కాదు. డబ్బు సంపాదించడం కోసమే మనం చాలా కష్టపడుతున్నాం. అయితే కొందరికి ఎల్లప్పుడూ డబ్బు చేతిలో నిలవదు. కొందరు డబ్బు సంపాదించలేకపోతుంటారు. ఇక కొందరికి మాత్రం పట్టిందల్లా బంగారమే అవుతుంటుంది. వారు ఏం చేసినా కలసి వస్తుంది. ఇలాంటి వారికి కొన్ని సార్లు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. అయితే ఎవరికైనా సరే ఆకస్మిక ధనలాభం కలిగే ముందు వారి ఇంట్లో.. చుట్టు పక్కలా పలు సూచనలు కనిపిస్తాయట. వాటిని బట్టి ఆకస్మిక ధన లాభం కలగబోతుందని అర్థం చేసుకోవచ్చు. అయితే అందుకు మనకు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మనకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటే మన ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటాయట. లక్ష్మీదేవి మనకు పెద్ద ఎత్తున ధనాన్ని అనుగ్రహించబోతుందని అర్థం.
2. మన ఇంట్లోకి ఏదైనా పక్షి వచ్చి గూడు పెడితే అది చాలా శుభ సూచకం అట. దీని వల్ల చాలా మేలు జరుగుతుందట.
3. ఇంట్లో ఎక్కడైనా సరే సడెన్ గా 3 బల్లులు పక్క పక్కనే కనిపిస్తే.. ఆకస్మిక ధనలాభం కలగబోతుందని అర్థమట. ఇది కూడా చాలా శుభ సూచకమని పండితులు చెబుతున్నారు.
4. మీ కుడి చేయిపై ఎలాంటి దద్దుర్లు లేకపోయినా.. ఇన్ఫెక్షన్ లేకున్నా.. సడెన్‌గా దురద పెడుతుందంటే.. అది చాలా శుభ సూచకమని పండితులు చెబుతున్నారు. దీని వల్ల కూడా ఆకస్మిక ధనలాభం కలుగుతుందని అంటున్నారు.
5. కలలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగిస, బల్లి, నక్షత్రం, గులాబీ పువ్వు కనిపిస్తే ధనం రాబోతుందని అర్థం చేసుకోవాలి.
6. ఉదయం లేవగానే శంకువు మోగినట్లు శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నట్లు అర్థం చేసుకోవాలి.
7. ఇంటి నుంచి బయటకు రాగానే చెరుకు గడలు కనిపిస్తే అది చాలా మంచిదని.. ధనం రాబోతుందని తెలుసుకోవాలి.
ఇలా మనకు ఆకస్మిక ధనలాభం కలిగే ముందు పలు సూచనలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు పోతాయని.. అంతా మంచే జరుగుతుందని వారంటున్నారు.