Trisha : దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు నటి త్రిష ఒక వెలుగు వెలిగింది. ఈమెకు సౌత్‌కు చెందిన అనేక చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈమె అప్పట్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. అయితే అనూహ్యంగా త్రిష సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఒకటి రెండు చిత్రాల్లో నటించినా అవి హిట్ కాలేదు. దీంతో ఈమె సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే అని భావించవచ్చు. అయితే త్రిష సినిమా ఇండస్ట్రీకి దూరం అవడం వెనుక తాను చేజేతులా చేసుకున్న తప్పులే ఉన్నాయని తెలుస్తోంది.
త్రిష అప్పట్లో విక్రమ్ సరసన సామి 2 అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. ఆ మేరకు పారితోషికం కూడా తీసుకుంది. అయితే చివరి నిమిషంలో.. షూటింగ్ జరిగే సమయానికి తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో నిర్మాత, దర్శకుడు షాకయ్యారు. ఈ క్రమంలోనే ఆమె రావడమే లొకేషన్‌కు ఆలస్యంగా షూటింగ్ కు వచ్చింది. పైగా తాను సినిమాలో నటించడం లేదని చెప్పి అక్కడి నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లిపోయింది. దీంతో ఆమె వ్యవహార శైలి దర్శక నిర్మాతలకు ఆగ్రహం తెప్పించింది.
అయితే అంత జరిగినా దర్శక నిర్మాతలు కామ్‌గానే ఉన్నారు. ఆమెను కలిసేందుకు వారే హోటల్‌కు వెళ్లారట. కానీ వారిని అక్కడ గంటల తరబడి వేచి ఉండేలా చేసి చివరకు వారిని ఆమె కలవనే లేదట. దీంతో వారు ఇంకా కోపోద్రిక్తులయ్యారు. ఈ విషయాన్ని తమ సంఘాల్లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో అప్పట్లో తమిళ నటీనటుల సంఘం అధ్యక్షుడు విశాల్ ఆమెను కొంత కాలం పాటు బ్యాన్ చేశారు. ఈ క్రమంలోనే సినిమాలకు త్రిష దూరమైంది. తరువాత ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ అవేవీ విజయం సాధించలేదు. అలా త్రిష తన చేతులతో తానే తన సినీ కెరీర్‌ను నాశనం చేసుకుందని తెలుస్తోంది.