Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Biryani : ట‌మాటా బిర్యానీని ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఇలా చేయాలి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

D by D
May 30, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Biryani : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. నాన్ వెజ్ తో చేసే బిర్యానీలే కాకుండా కూర‌గాయ‌ల‌తో కూడా బిర్యానీని త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన‌రుచిక‌ర‌మైన బిర్యానీల‌లో ట‌మాట బిర్యానీ కూడా ఒక‌టి. ట‌మాటాల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా ఈ ట‌మాట బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 3, యాల‌కులు – 4, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, స్టోన్ ప్ల‌వ‌ర్ – 1, జాప‌త్రి – కొద్దిగా, జీడిప‌ప్పు – 10, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన బీన్స్ – 10, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన బంగాళాదుంప – పెద్ద‌ది ఒక‌టి, చిన్న‌గా త‌రిగిన పెద్ద ట‌మాటాలు – 3, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, నాన‌బెట్టిన బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మసాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్.

Tomato Biryani recipe in telugu make in this way
Tomato Biryani

ట‌మాట బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత బీన్స్, క్యారెట్, బంగాళాదుంప వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత క‌రివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డి వ‌ర‌కు వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత బియ్యం, నీళ్లు పోసి క‌ల‌పాలి.

త‌రువాత ఉప్పు, కారం గ‌రం మ‌సాలా, కొత్తిమీర‌, పుదీనా, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మ‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట బిర్యానీ తయార‌వుతుంది. దీనిని మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ట‌మాటాల‌తో చేసిన ఈ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Biryani
Previous Post

Champaran Mutton : ఎప్పటిలా కాకుండా మటన్ కర్రీని ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Next Post

Honey : తేనె గురించి అంద‌రికీ తెలుసు.. కానీ ద‌గ్గు, జ‌లుబు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు ఎలా వాడాలో తెలుసా..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!