Tomato Capsicum Chutney : ట‌మాటా, క్యాప్సికం చ‌ట్నీని ఇలా చేసి తింటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

Tomato Capsicum Chutney : మ‌నం క్యాప్సికంను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. క్యాప్సికంను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. క్యాప్సికంను ఎక్కువ‌గా మ‌నం ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే చ‌ట్నీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చ‌ట్నీని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్యాప్సికంతో రుచిగా చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికం ట‌మాట చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన క్యాప్సికం – పావు కిలో, త‌రిగిన టమాటాలు – 2, ప‌చ్చిమిర్చి – 10, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ఎండుమిర్చి – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కొత్తిమీర – కొద్దిగా.

Tomato Capsicum Chutney recipe easy to make
Tomato Capsicum Chutney

క్యాప్సికం ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, క్యాప్సికం ముక్క‌లు వేసి వేయించాలి. క్యాప్సికం ముక్క‌లు స‌గానికి పైగా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాల త‌రువాత మూత తీసి ప‌సుపు, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. క్యాప్సికం ముక్క‌లు చ‌ల్లారిన త‌రువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత మ‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికంతో ఈ విధంగా త‌యారు చేసిన ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts