Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Pulao : టమాటా పులావ్ ను త్వరగా చేయాలంటే.. ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

D by D
April 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Pulao : మ‌నం ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రైస్ వెరైటీలు రుచిగా ఉండ‌డంతో పాటు చేయ‌డానికి కూడా తేలిక‌గా ఉంటాయి. ఈ విధంగా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన రైస్ వెరైటీల‌లో ట‌మాట పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వ‌ర‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే బ్యాచిల‌ర్స్, మొదటిసారి చేసేవారు ఇలా ఎవ‌రైనా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు.వంట ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా ట‌మాట పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, సుల‌భంగా ట‌మాట పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, లవంగాలు – 4, మ‌రాఠీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకులు – చిన్న‌వి రెండు, సాజీరా – ఒక టీ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన క్యాప్సికం – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన బంగాళాదుంప – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 3, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్, నాన‌బెట్టిన బియ్యం – 2 గ్లాసులు, నీళ్లు – 3 గ్లాసులు, ప‌చ్చి బ‌ఠాణీ – ఒక టేబుల్ స్పూన్.

Tomato Pulao recipe in telugu very tasty how to make
Tomato Pulao

ట‌మాట పులావ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత కూర‌గాయ ముక్క‌లు, బ‌ఠాణీ వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఈ ముక్క‌ల‌ను మెత్త‌బడే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్కలు వేసి క‌ల‌పాలి. టమాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి.

ఇప్పుడు నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మూత పెట్టి నీరంతా పోయి అన్నం పులావ్ పొడి పొడిగా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ప‌ది నిమిషాల త‌రువాత అంతా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి, నోటికి రుచిగా, స్పెష‌ల్ గా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ట‌మాట పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Pulao
Previous Post

Vankaya Vepudu : వంకాయ వేపుడును 10 నిమిషాల్లో రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నం, రసం, సాంబార్ లోకి బాగుంటుంది..!

Next Post

Chia Seeds For Belly Fat : దీన్ని తీసుకుంటే చాలు.. పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన ఎలాంటి కొవ్వు అయినా స‌రే క‌రుగుతుంది..!

Related Posts

inspiration

చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట‌..

June 3, 2025
వైద్య విజ్ఞానం

భూమిపై క్యాన్సర్ రాని ఒకే ఒక జంతువు ఏదో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 3, 2025
పోష‌కాహారం

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025
lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!