Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Tomato Ulli Karam : టమాటా ఉల్లికారం రుచిగా ఇలా చేయండి.. రైస్, చపాతీల్లోకి బాగుంటుంది..!

D by D
April 13, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Tomato Ulli Karam : ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వంట‌ల్లో మ‌నం ట‌మాటాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాలు మ‌న ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తాయి. ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాలు, ప‌చ్చ‌ళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లిపాయ కారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ట‌మాట ఉల్లికారాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాట ఉల్లికారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట ఉల్లికారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన ట‌మాటాలు – 4, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, వెల్లుల్లి – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Tomato Ulli Karam recipe in telugu make in this method
Tomato Ulli Karam

ట‌మాట ఉల్లికారం త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు, కారం, వెల్లుల్లి రెబ్బ‌లు, కొద్దిగా ఉప్పు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా ఉడికించాలి.

ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ఉల్లికారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ట‌మాటాల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ట‌మాట ఉల్లికారాన్ని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Ulli Karam
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Immunity : ఇమ్యూనిటీ చాలా త్వ‌రగా పెరుగుతుంది.. జ్వ‌రం, నీర‌సం అన్నీ త‌గ్గుతాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.