Vankaya Kura : వంకాయలతో రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చాలా మంది వంకాయలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా తయారు చేసుకునేంత సులభంగా, రుచిగా వంకాయలతో కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – అరకిలో, చిన్న ముక్కలుగా తరిగిన టమాటాలు – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చి బఠాణీ – అర కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – పావు గ్లాస్, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ఉప్పు నీటిలో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చి బఠాణీ, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వంకాయ ముక్కలు సగం వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత కారం, గరం మసాలా వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ కూరను విడిచి పెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు. వంకాయలతో ఈ విధంగా సులభంగా కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.