Vastu Tips : మనిషి ఎలా జీవించాలని చెప్పే శాస్త్రాలల్లో వాస్తు శాస్త్రం కూడా ఒకటి. ప్రాచీనమైన శాస్త్రాల్లో ఇది కూడా ఒకటి. వాస్తుశాస్త్రానికి అనుగుణంగా విధులను నిర్వర్తించడం వల్ల ఎల్లప్పుడూ మనం ఆనందంగా, సంతోషంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవింగలుగుతాము. వాస్తు శాస్త్రానికి విరుద్దంగా విధులు నిర్వర్తించడం వల్ల పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. దీంతో మనం కష్టాల బారిన పడాల్సి వస్తుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను మనం ఎవరి దగ్గర నుండి ఫ్రీగా తీసుకోకూడదు. ఈ వస్తువులను ఉచితంగా ఇతరుల నుండి తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియకపోవడం చేత ఆయా వస్తువులను ఇతరుల నుండి ఉచితంగా తీసుకుంటూ ఉంటారు.
దీంతో ఆర్థిక సమస్యలతో, కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉంటారు. కనుక మనం ఇతరుల నుండి ఉచితంగా తీసుకోకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇతరుల నుండి మనం ఉప్పును తీసుకోకూడదు. వాస్తుశాస్త్రంలో ఉప్పును శనితో భావిస్తారు. ఉచితంగా దీనిని ఎవరి నుండి తీసుకోకూడదు. ఉప్పును తీసుకోవడం వల్ల ఆర్థిక బాధలు ఎక్కువవుతాయి. అలాగే శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉచితంగా తీసుకున్న ఉప్పును వాడడం వల్ల అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది కనుక ఉచితంగా ఉప్పును ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు.
అలాగే ఇతరుల నుండి రుమాలును తీసుకోవడం వల్ల ఇతరుల రుమాలు వాడడం వల్ల కూడా ఇబ్బందుల బారిన పడాల్సి వస్తుంది. ఉచితంగా రుమాలును తీసుకుని ఉపయోగించడం వల్ల ఇంట్లో గొడవలు ఎక్కువవుతాయి. వ్యక్తుల మధ్య బంధాలు క్షీణిస్తాయి. కనుక ఇతరుల నుండి ఉచితంగా రుమాలును తీసుకోకూడదు. ఇక ఇనుమును కూడా మనం ఎవరి దగ్గర నుండి ఉచితంగా తీసుకోకూడదు. ఇనుమును, ఇనుప వస్తువులను ఒకరి దగ్గర నుండి ఉచితంగా తీసుకోవడం వల్ల ఇంట్లో ఒక దాని తరువాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కనుక వీటిని కూడా ఒకరి దగ్గర నుండి ఉచితంగా తీసుకోకూడదు. అదే విధంగా సూదిని కూడా ఇతరుల నుండి ఉచితంగా తీసుకోకూడదు. సూదిని ఇతరుల నుండి తీసుకోవడం వల్ల మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు దూరమవుతాయి.
ఆర్థిక బాధలు ఎక్కువవుతాయి. కనుక మనం కావాల్సి వచ్చినప్పుడు మన సూదిని మనం కొనుగోలు చేసివాడడం మంచిది. అలాగే నూనెను కూడా ఉచితంగా తీసుకోకూడదు. నూనె శని దేవుడికి సంబంధించింది. ఇతరుల నుండి ఉచితంగా నూనెను తీసుకుని వాడడం వల్ల జీవితంలో పేదరికానికి గురి కావాల్సి వస్తుంది. కనుక ఈ వస్తువులను ఇతర నుండి ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా తీసుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.