Vastu Tips : మన ఇంట్లో మనం చేసే పనులతోపాటు వాస్తు దోషాల వల్ల కూడా మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తుంటాయి. దీంతో ఇల్లు మొత్తం నెగెటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఫలితంగా మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఇంట్లోని వారికి అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఏ పనిచేసినా కలసిరాదు. ఎంతో డబ్బు నష్టపోతారు. ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలాంటివన్నీ జరుగుతుంటే.. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కింద చెప్పిన విధంగా చేస్తే ఫలితం ఉంటుంది. మరి అందుకు ఏం చేయాలంటే..
ఒక గాజు పాత్రను తీసుకోవాలి. అందులో రాళ్ల ఉప్పు (గల్లు ఉప్పు)ను నింపాలి. ఆ పాత్రలో మధ్యలో ఉప్పు మీద ఒక నిమ్మ పండును ఉంచాలి. అనంతరం నాలుగు మిరపకాయలను తీసుకుని వాటి తొడమలు ఉప్పులో మునిగే విధంగా వాటిని నిమ్మ పండుకు నాలుగు వైపులా ఉంచాలి. ఇలా ప్రతి మంగళవారం చేయాలి.
ఈ విధంగా ప్రతి మంగళవారం చేస్తే ఇంట్లోని దుష్టశక్తులు పోతాయి. ఇంట్లో మనకు సమస్యలు తగ్గుతుంటే అప్పుడు దుష్టశక్తులు పోతున్నట్లు అర్థం చేసుకోవాలి. సమస్యలు తగ్గేవరకు ప్రతి మంగళవారం ఇలా చేయాలి. రోజంతా ఈ విధంగా ఉంచి మరుసటి రోజు వాటిని ప్రవహించే నీటిలో పారబోయాలి. లేదా వాటిని ఎవరూ నడవని చోట పారేయాలి. ఇలా చేస్తుంటే ఇంట్లోని దుష్టశక్తులు పోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీంతో అన్ని సమస్యలు పోతాయని పండితులు చెబుతున్నారు.