Vastu Tips : పూర్వకాలం నుంచి మన పెద్దలు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. వాస్తు వల్ల మన జీవితం సుఖంగా, సంతోషాలమయంగా ఉంటుందని వారు నమ్ముతూ వస్తున్నారు. అందుకనే వాస్తును చాలా మంది అనుసరిస్తారు. వాస్తు అనేది కేవలం ఇంటికే కాదు, ఇంట్లోని అనేక అంశాలకు కూడా వర్తిస్తుంది. మీరు గనక నిత్యం, ఒత్తిడి, ఆందోళన, మృత్యుభయం, దుష్టశక్తుల భయంతో బాధపడుతుంటే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే. అలాంటి సమయాల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు నిద్రించేటప్పుడు మీ దిండు కింద కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇక ఆ వస్తువులు ఏమిటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏదైనా ఒక కాయిన్‌ను మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వాస్తు దోషం మీపై పడకుండా చేస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోయేలా చేస్తుంది.
సువాసన వెదజల్లే పువ్వులు..
మీకు ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటూ, పీడ కలలు, భయాన్నిగొలిపే కలలు ఎక్కువగా వస్తుంటే మీరు దిండు కింద ఒక కత్తిని పెట్టుకుని నిద్రించండి. దీంతో అలాంటి కలలు రావు. మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కగా నిద్ర పడుతుంది. మీరు నిద్రించే దిండు కింద సువాసన వెదజల్లే పువ్వులను పెట్టుకుని కూడా నిద్రించవచ్చు. దీంతో కూడా మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దంపతులు ఇలా పెట్టుకుని నిద్రిస్తే వారి మధ్య ఉండే కలహాలు పోతాయి. వారు అన్యోన్యంగా కాపురం చేస్తారు.
మీరు నిద్రంచేటప్పుడు పక్కన ఏదైనా టేబుల్ లేదా స్టాండ్ మీద భగవద్గీతను పెట్టుకోండి. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపుతుంది. దీంతోపాటు దుష్టశక్తులు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. వాస్తు దోషాలు పోయి మీకు ఉండే సమస్యలు తగ్గుతాయి. అలాగే నిద్రించే దిండు కింద మీరు కొన్ని యాలకులను మూటగా కట్టి పెట్టుకుంటే నిద్ర ప్రశాంతంగా పడుతుంది. మైండ్ రిలాక్స్ అయి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
రాగి చెంబు..
నిద్రించేటప్పుడు మీరు ఒక రాగి చెంబులో నీటిని పోసి మీ బెడ్ పక్కన లేదా బెడ్ కింద నేలపై పెట్టుకోండి. ఇది మీకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. రాత్రి పూట మీకు పీడకలలు రాకుండా చేస్తుంది. రాత్రి ఒకవేళ నిద్ర లేస్తే ఈ పాత్రలోని నీరు తాగి పడుకోండి. దీంతో మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే నిద్రించేటప్పుడు దిండు కింద సోంపు గింజలను ఒక మూటగా కట్టి పెట్టుకోవచ్చు. దీంతో మీపై ఉండే రాహు దోషం పోతుంది. మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. దిండు కింద మీరు వెల్లుల్లి రెబ్బలు 2 పెట్టుకుని కూడా నిద్రించవచ్చు. దీంతో మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు సమస్యల నుంచి బయట పడతారు. ఇలా నిద్రించే సమయంలో ఈ వాస్తు నియమాలను పాటిస్తే ఎలాంటి దోషాలు లేకుండా హాయిగా జీవించవచ్చు. అలాగే డబ్బు సమస్యలు కూడా తీరిపోతాయి.