Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Veg Kathi Rolls : బేక‌రీల‌లో ల‌భించే ఈ వెజ్ రోల్స్‌ను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

D by D
September 11, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Veg Kathi Rolls : వెజ్ ఖాటీ రోల్.. మ‌న‌కు బ‌య‌ట ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి, లంచ్ బాక్స్ లోకి ఈ రోల్ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌లు కూడా ఈ రోల్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రోల్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలాతేలిక‌. మొద‌టిసారి చేసే వారు ఈ రోల్ ను ప‌ర్ఫెక్ట్ గా త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ వెజ్ ఖాటీ రోల్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ ఖాటీ రోల్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – అర క‌ప్పు, మైదాపిండి – అర క‌ప్పు, ఉప్పు – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, స‌న్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, క్యాబేజి త‌రుగు – అర క‌ప్పు, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, కారం – ముప్పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, ట‌మాట కిచ‌ప్ – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన క్యాప్సికం – చిన్న‌ది ఒక‌టి, ప‌నీర్ – 75 గ్రా.

Veg Kathi Rolls recipe in telugu make in this method
Veg Kathi Rolls

పుదీనా చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుదీనా – ఒక పెద్ద క‌ట్ట‌, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – ఒక పెద్ద క‌ట్ట‌, ప‌చ్చిమిర్చి – 4, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

వెజ్ ఖాటీ రోల్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండి, మైదాపిండి, ఉప్పు, నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి మెత్త‌బ‌డిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా మెత్త‌బ‌డిన త‌రువాత క్యాబేజి తురుము వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ట‌మాట కిచ‌ప్, క్యాప్సికం వేసి క‌ల‌పాలి. క్యాప్సికం మెత్త‌బ‌డిన త‌రువాత ప‌నీర్ ను పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి.

ఇప్పుడు పుదీనా చ‌ట్నీ కోసం జార్ లో త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి త‌గినన్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ముందుగా క‌లిపి పెట్టిన పిండిని ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత దీనిని వేడి వేడి పెనం మీద వేసి నూనె వేయ‌కుండా రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత ఒక్కో చ‌పాతీని తీసుకుంటూ ముందుగా దానిపై గ్రీన్ చ‌ట్నీని రాసుకోవాలి. త‌రువాత 3 టేబుల్ స్పూన్ల ప‌నీర్ మిశ్ర‌మాన్ని వేసి గ‌ట్టిగా రోల్ చేసుకుని మ‌ధ్య‌లోకి క‌ట్ చేసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఖాటీ రోల్స్ త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు.

Tags: Veg Kathi Rolls
Previous Post

Instant Saggubiyyam Dosa : స‌గ్గుబియ్యంతో ఇన్‌స్టంట్‌గా దోశ‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Next Post

Sleep : మీ వ‌య‌స్సు ప్ర‌కారం మీరు రోజూ ఎన్ని గంట‌ల‌పాటు నిద్రించాలో తెలుసా..?

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.