Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Veg Kheema : నాన్ వెజ్‌తో ప‌నిలేదు.. ఇలా వెజ్ కీమాను కూడా చేయ‌వ‌చ్చు.. టేస్ట్ చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
December 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Veg Kheema : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో త‌యారు చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో సోయా ఖీమా కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ల‌తో చేసే ఈ ఖీమా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేక‌ర్ లతో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో రుచిగా, సుల‌భంగా ఖీమా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సోయా ఖీమా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీల్ మేక‌ర్ – ముప్పావు క‌ప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, మిరియాలు – 10, ఎండుమిర్చి – 1,త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – 1/3 క‌ప్పు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ట‌మాటాలు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చిబ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ముప్పావు క‌ప్పు, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్, ప్రెష్ క్రీమ్ – అర టేబుల్ స్పూన్, బ‌ట‌ర్ – అర టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Veg Kheema recipe you can make this very easily
Veg Kheema

సోయా ఖీమా త‌యారీ విధానం..

ముందుగా మీల్ మేక‌ర్ ల‌ను వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత నీటిని పిండేసి ఈ మీల్ మేక‌ర్ ల‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌కర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసివేసుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని కూడా బాగా వేయించిన త‌రువాత ప‌చ్చిబ‌ఠాణీ, మీల్ మేక‌ర్ మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి.

దీనిని 4 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఖీమా చ‌క్క‌గా ఉడికిన త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరిమెంతి, ప్రెష్ క్రీమ్, బ‌ట‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సోయా ఖీమా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన సోయా ఖీమాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Veg Kheema
Previous Post

Constipation In Kids : చిన్నారుల్లో వ‌చ్చే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Next Post

Aloo Mixture : ఆలు మిక్చ‌ర్ ఇలా చేయండి.. క‌ర‌క‌ర‌లాడుతూ 15 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025
international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.