Vijay Devarakonda : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం.. లైగర్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఈ మూవీకి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

విజయ్ దేవరకొండ గురించి మాట్లాడిన అనన్య పాండే అతను ఒక ఉత్తమ నటుడని కితాబిచ్చింది. విజయ్ సినిమాల్లో కనిపించేది వేరని.. బయట ఇంకోలా ఉంటాడని చెప్పింది. అతన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందని.. సినిమాల్లో అతను భిన్న పాత్రలను పోషిస్తాడని చెప్పింది.
ఇక విజయ్ మనసులో ఏమి ఉన్నా దాచుకోడని.. సులభంగానే బయట పడతాడని పేర్కొంది. కానీ విజయ్ పిరికివాడని అనన్య షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే విజయ్‌తో చాలా సులభంగా నటించవచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే విజయ్‌పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక లైగర్ మూవీని ఆగస్టు 25వ తేదీన భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మాజీ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ నటించారు.