Viral Video : అమాయ‌క‌మైన కుక్క‌ను త‌న్న‌బోయాడు.. తానే కింద ప‌డ్డాడు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : మ‌నం చేసే ప‌నులే మ‌న‌కు క‌ర్మ ఫ‌లితాన్ని నిర్దేశిస్తాయి.. అనే మాట‌ల‌ను మ‌నం త‌ర‌చూ వింటుంటాం. మ‌నం ఒక త‌ప్పు చేస్తే అందుకు త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని ఏదో ఒక నాడు క‌చ్చితంగా అనుభ‌వించాల్సి వ‌స్తుంది. అయితే కొంద‌రికి మాత్రం అది వెనువెంట‌నే జ‌రిగిపోతుంది. అవును.. అందుకు ఉదాహ‌ర‌ణ‌.. ఈ సంఘ‌ట‌నే.

Viral Video man attempted to kick dog but failed
Viral Video

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్య‌క్తి ఓ అమాయ‌క‌మైన కుక్క‌ను త‌న్న‌బోయాడు. కానీ ఆ క్ర‌మంలో అత‌నే కింద‌ప‌డ్డాడు. అక్క‌డ ఏమీ అన‌కుండా.. క‌నీసం అడ్డు కూడా రాకుండా ఉన్న కుక్క‌ను అత‌ను త‌న్న‌బోతే.. అదే ఊపులో కింద‌ప‌డిపోయాడు. ఈ క్ర‌మంలోనే ఆ దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఈ వీడియోను ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది వీక్షించారు. చాలా మంది నెటిజ‌న్లు అతనికి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఏమీ చేయ‌కుండా అమాయ‌కంగా చూస్తున్న కుక్క‌ను త‌న్న‌బోయినందుకు త‌గిన ఫ‌లితం ల‌భించింద‌ని.. క‌ర్మ ఫ‌లితం అంటే అదేన‌ని అంటున్నారు.

Admin

Recent Posts