Watermelon Ice Cream : పుచ్చ‌కాయ ఐస్ క్రీమ్‌.. ఎంతో టేస్టీగా.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Watermelon Ice Cream : వేస‌వి కాలంలో పుచ్చ‌కాయ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్ష‌ణీయంగా ఉంటాయి. వీటిల్లో 90 శాతం నీరే ఉంటుంది. కనుక వేస‌విలో వీటిని తింటే నీరు బాగా ల‌భిస్తుంది. ఇది శ‌రీరంలోని వేడిని త‌గ్గిస్తుంది. అలాగే ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. పుచ్చ‌కాయ‌లు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వీటితో ఐస్‌క్రీమ్ కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా దీన్ని తింటే శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గుతుంది. ఇక పుచ్చ‌కాయ‌తో ఐస్ క్రీమ్ ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Watermelon Ice Cream very easy to make
Watermelon Ice Cream

పుచ్చ‌కాయ ఐస్ క్రీమ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుచ్చ‌కాయ జ్యూస్ – ఒక‌టిన్న‌ర క‌ప్పు, తాజా క్రీమ్ – 400 ఎంఎల్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ – ఒక టీస్పూన్‌, తియ్య‌ని కండెన్స్‌డ్ మిల్క్ – ఒక క‌ప్పు.

పుచ్చ‌కాయ ఐస్ క్రీమ్ త‌యారు చేసే విధానం..

పుచ్చ‌కాయ‌ను క‌ట్ చేసి ముక్క‌లుగా చేసుకుని వాటిని మిక్సీలో వేసి జ్యూస్‌లా ప‌ట్టుకోవాలి. విత్త‌నాలు లేకుండా చూసుకోవాలి. త‌రువాత వ‌డ‌క‌ట్టి ప‌క్క‌న పెట్టాలి. ఒక బౌల్‌లో క్రీమ్ తీసుకుని బీట‌ర్‌తో సాఫ్ట్‌గా అయ్యేలా చేయాలి. త‌రువాత వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ క‌ల‌పాలి. ఇప్పుడు కండెన్స్‌డ్ మిల్క్ వేసి క‌లియ‌బెట్టాలి. త‌రువాత పుచ్చ‌కాయ జ్యూస్‌ను క‌ల‌పాలి. ఐస్‌క్రీమ్ మిక్చ‌ర్‌లోకి మార్చుకుని ఫ్రిజ్‌లో 10 గంట‌ల పాటు పెట్టాలి. అంతే.. పుచ్చ‌కాయ ఐస్‌క్రీమ్ రెడీ అవుతుంది. దీన్ని ఫ్రిజ్‌లోనే ఉంచి కావాల‌నుకున్న‌ప్పుడు తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తింటే శరీరంలోని వేడి మొత్తం త‌గ్గుతుంది.

Editor

Recent Posts