Watermelon Smoothie : పుచ్చ‌కాయ‌ల‌తో దీన్ని త‌యారు చేసి చ‌ల్ల చ‌ల్ల‌గా తాగండి.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Watermelon Smoothie : పుచ్చకాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పుచ్చకాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు అందుతాయి. పుచ్చ‌కాయ‌ను నేరుగా తిన‌డంతో పాటు దీనితో మ‌నం రుచిక‌ర‌మైన స్మూతీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ స్మూతీని మ‌నం కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సాన్ని త‌గ్గించ‌డంలో ఈ స్మూతీ చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. పుచ్చ‌కాయ‌తో మ‌న ఆరోగ్యానికి మేలు చేసేలా, మ‌న శ‌రీరానికి చ‌లువ చేసేలా స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వాట‌ర్ మెల‌న్ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుచ్చకాయ ముక్క‌లు – రెండు క‌ప్పులు, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, నాన‌బెట్టిన చియా విత్త‌నాలు – ఒక టేబుల్ స్పూన్స్, పంచ‌దార – 5 టీ స్పూన్స్, త‌రిగిన ఖ‌ర్జూర పండ్లు – 4.

Watermelon Smoothie recipe in telugu make in this method
Watermelon Smoothie

వాట‌ర్ మెల‌న్ స్మూతీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పుచ్చకాయ ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో చియా విత్త‌నాలు, ఖ‌ర్జూర పండ్లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పెరుగు, పంచ‌దార‌, ఐస్ క్యూబ్స్ వేసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత దీనిని గ్లాస్ లో పోసి పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వాట‌ర్ మెల‌న్ స్మూతీ త‌యార‌వుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

D

Recent Posts