సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వారంలో ఒకరోజు ఒక్కో దేవుడికి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమం సోమవారం శివుడు, మంగళవారం అమ్మవారు, బుధవారం వినాయకుడు ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రత్యేకమైన. అదేవిధంగా శనివారం గరుడ దేవుడికి కూడా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. పక్షులలో రారాజుగా ఉంటూ, విష్ణు దేవుడికి వాహనమైన ఈ గరుడను ముఖ్యంగా శనివారం రోజు పూజిస్తారు. ఈ విధంగా గరుడని పూజించడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని భావిస్తారు.
శనివారం ఉదయం గరుడుడికి పెద్ద ఎత్తున పూజలు చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.అదేవిధంగా ఆదివారం గరుడకు పూజ చేయడం వల్ల దీర్ఘకాలికంగా వెంటాడుతున్న వ్యాధుల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. సోమ మంగళవారం గరుడని పూజించడం ద్వారా మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి.
అదేవిధంగా బుధ గురు వారాలలో గరుత్మంతుడిని పూజించడం వల్ల మన పై ఏర్పడిన దుష్టశక్తుల ప్రభావం తొలిగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అష్టైశ్వర్యాలు కలగాలంటే గరుడుని శుక్రవారం పూజించాలి. ఈ విధంగా గరుడను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.