Wheat Flour Snacks : గోధుమపిండితో చపాతీ, రోటీ, పూరీ వంటి వాటినే కాకుండా మనం రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. గోధుమపిండితో చేసే ఏ స్నాక్స్ అయినా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కింద చెప్పిన విధంగా చేసే ఈ గోధుమపిండి స్నాక్స్ కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలు వీటిని తినడానికి చాలా ఇష్టపడతారని చెప్పవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ స్నాక్స్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ గోధుమపిండి స్నాక్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి స్నాక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, కసూరిమెంతి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
గోధుమపిండి స్నాక్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత కసూరిమెంతి, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని సమానంగా ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత ఈ చపాతీని మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో డీప్ ప్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చపాతీ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ వేయించాలి. వీటిని ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి స్నాక్స్ తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 10 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన స్నాక్స్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.