White Chitrannam : మనం అన్నాన్ని కూరలతో తినడంతో పాటు అన్నంతో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాం. రైస్ వెరైటీలను చాలా త్వరగా, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అన్నంతో చేసుకోదగిన చక్కటి వంటకాలలో వైట్ చిత్రాన్నం కూడా ఒకటి. కర్ణాటక స్పెషల్ వంటకం అయిన వైట్ చిత్రాన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా వైట్ చిత్రన్నాన్ని తయారు చేసుకుని తినవచ్చు. కమ్మగా, రుచిగా ఉండే ఈ వైట్ చిత్రాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ చిత్రాన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 15, పల్లీలు – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – 10, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, ఉల్లిపాయ తరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, సోయ కూర తరుగు – ముప్పావు కప్పు, పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు, అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత.
వైట్ చిత్రాన్నం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు, పల్లీలు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసి వేయించాలి.
తరువాత సోయకూర తరుగు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత అన్నం, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇలా చక్కగా వేయించిన తరువాత వేయించిన జీడిపప్పు, పల్లీలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వైట్ చిత్రాన్నం తయారవుతుంది. లంచ్ బాక్స్ లోకి ఈ చిత్రాన్నం చాలా చక్కగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.