ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్ రైల్వేస్ ఒకటనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దేశంలో కోట్లాది మందిని తమ గమ్య స్థానాలకు చేర్చడంలో ఇండియన్ రైల్వేస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ధరలో సుదూర గమ్యాలకు చేరుకోవడంలో రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. రైలు బండి ఎక్కేటప్పుడు ఆ రైలులో అనేక కోచ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ కూపేలాంటివి ఉంటాయి. ఈ కోచ్ ల టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసే సమయంలో సాధారణ కోచ్ లు ముందు, చివర ఉంటాయి. ప్రతి రైలులో ఇలాగే ఉంటాయి
అయితే వాటికి కారణం ఏంటనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు కారణం ఏంటంటే..సాధారణంగా రిజర్వేషన్ బోగీలతో పోల్చితే.. జనరల్ కోచ్‌లలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఈ రెండు కోచ్‌లు చివర్లో ఏర్పడు చేయడం వల్ల జనరల్ బోగీ ప్రయాణికులు సరిసమానంగా ముందు, వెనుకకు వెళ్తారు. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో జనరల్ బోగీ నుంచి పెద్ద ఎత్తున దిగే ప్రయాణికులు రెండు వైపుల సమానంగా వెళ్తారు. దీనివల్ల స్టేషన్‌లో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడరు. ప్రయాణికులను రెండు వైపులా డివైడ్ చేయడం వల్ల రద్దీని నియంత్రించవచ్చు.ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్రయాణికులకు కూడా సౌకర్యం ఉండేలా రైల్వే చూస్తుంది.
స్టేషన్ లోకి ప్రవేశించిన వెంటనే వారు బోగీలో ఎక్కేలా రైలుకు మధ్యలో ఉంచుతారు. అత్యవసర పరిస్థితుల్లో జనరల్ కోచ్ లను రెండువైపులా విడదీయడంద్వారా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు సహాయక చర్యలు తీసుకునే విషయంలో ఎంతో సౌలభ్యం లభిస్తుంది. ఒకేచోట ప్రయాణికులు భారీగా గుడికూడటంవల్ల ఇబ్బందులు పెరుగుతాయేకానీ తగ్గవని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను మధ్యలో ఉంచి అక్కడ బరువు పెరిగితే రైలు పట్టాలు తప్పే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను రైలు ప్రారంభంలో మరియు చివరిలో ఉంచుతారు మరియు ఏసీ మరియు స్లీపర్ కోచ్‌లను మధ్యలో ఉంచుతారు.