Biryani : బిర్యానీ పేరు చెప్పగానే సహజంగానే మనకు నోట్లో నీళ్లు ఊరతాయి. బిర్యానీని ఎప్పుడెప్పుడు తిందామా.. అని ఆశగా ఎదురు చూస్తుంటారు. చాలా మందికి బిర్యానీ అంటే సహజంగానే ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు తినేందుకు అనేక రకాల బిర్యానీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. రెస్టారెంట్‌లలో అయితే ఎంతో రుచికరమైన బిర్యానీలను వండి వడ్డిస్తారు. అయితే మనం ఇంట్లో కూడా బిర్యానీలను వండుతుంటాం. కానీ రెస్టారెంట్‌లలో వచ్చే టేస్ట్ మన ఇంట్లో వండే బిర్యానీకి రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది ? దీని వెనుక కారణాలు ఏమిటి ? అంటే..
మనం ఇంట్లో చాలా తక్కువ మొత్తంలో బిర్యానీని వండుతాం. కానీ రెస్టారంట్లలో అలా కాదు. రోజూ కిలోలకు కిలోలు బిర్యానీని వండుతారు. అందువల్ల పెద్ద మొత్తంలో రోజూ బియ్యం, మాంసం, మసాలాలను ఉపయోగిస్తుంటారు. అలాగే ఇంట్లో మనం చాలా తక్కువ సమయంలో బిర్యానీని వండుతాం. కానీ రెస్టారెంట్లలో బిర్యానీని వండేందుకు చాలా సమయం పడుతుంది. మాంసాన్ని మందుగా మారినేట్ చేస్తారు. మనం ఇంట్లో వాడని అనేక మసాలాలను వారు ఉపయోగిస్తారు. దీంతో సహజంగానే బిర్యానీ టేస్ట్ పెరుగుతుంది.
ఇక భారీ మొత్తంలో రెస్టారెంట్లలో బిర్యానీని రోజూ వండుతారు కనుక వారు చేయితిరిగి ఉంటారు. కాబట్టి వారికి ఏ మసాలాను ఎంత మోతాదులో వేయాలో కచ్చితంగా తెలుస్తుంది. దీంతోపాటు ఏ మసాలా వేస్తే బిర్యానీ ఎలా రుచిగా వస్తుందో కూడా వారికి తెలిసిపోతుంది. కనుక రెస్టారెంట్లలో వండే బిర్యానీ సహజంగానే మన ఇంట్లో వండే బిర్యానీ కన్నా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇవీ దాని వెనుక ఉన్న అసలు కారణాలు.