రోజు రోజుకి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది, సోషల్ మీడియాలో కూడా చాలా మంది యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకి ప్రతి ఒక్కరూ దగ్గరగానే ఉంటున్నారు తప్ప సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. చాలా మంది లైఫ్ ని కూడా రిస్క్ చేసి మరీ రీల్స్ చేస్తున్నారు.
తాజాగా ఒక ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఒక పెద్ద కొండ చివరన నిలబడి ఒక మహిళ రిస్క్ చేసింది. ప్రస్తుతం ఈ క్లిప్ చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వాళ్లలో ఉండే అడ్వెంచర్స్ ని బయట పెడుతూ ఇలాంటి వీడియోలని చాలా మంది షేర్ చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద కొండపై చివరి నిలబడి ఫోటోలు తీసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్..?
ఒకరు ఎక్స్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది. మిలియన్లు మందికి పైగా ఈ వీడియోని చూశారు. జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ పైనుంచి కింద పడితే గేమ్ ఓవర్ అయిపోతుంది అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫోటోలు కోసం, వీడియోలు కోసం ఇంత రిస్క్ చేయడం మంచిది కాదు.
— Second before disaster (@NeverteIImeodd) September 30, 2024