Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Yakhni Pulao : ఈ పులావ్‌ను ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!

D by D
November 12, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Yakhni Pulao : మ‌న‌కు ముస్లింల ఫంక్ష‌న్ ల‌ల్లో స‌ర్వ్ చేసే వంట‌కాల్లో య‌ఖ్ని పులావ్ కూడా ఒక‌టి. దీనిని రంజాన్ మాసంలో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. చికెన్ సూప్ తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. త‌రుచూ చేసే చికెన్ పులావ్ కంటే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ చికెన్ పులావ్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ముస్లింల ఫంక్ష‌న్ ల‌ల్లో ఎక్కువ‌గా వండించే ఈ య‌ఖ్ని పులావ్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

య‌ఖ్ని పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్,నూనె – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, న‌ల్ల యాల‌క్కాయ – 1, అనాస పువ్వు – 1, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, బిర్యానీ ఆకు – 1, సాజీరా – అర టీ స్పూన్, స‌న్న‌గా పొడవుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, అర‌గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – అర‌కిలో, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – కొద్దిగా, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీబియ్యం -ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఎండిన దేశ‌వాలీ గులాబీ రేకులు – ఒక టీ స్పూన్, రోజ్ వాట‌ర్ – ఒక టీ స్పూన్.

Yakhni Pulao recipe in telugu make in this method
Yakhni Pulao

చికెన్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – ఒక లీట‌ర్, చికెన్ బోన్స్ – 100 గ్రా., ప‌సుపు – పావు టీ స్పూన్, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, మిరియాలు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, త‌రిగిన కొత్తిమీర – అర క‌ట్ట‌.

య‌ఖ్ని పులావ్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే సూప్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి చిన్న మంట‌పై నీరు స‌గం అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి.త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు కుక్క‌ర్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్ వేసి 2 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ప‌చ్చిమిర్చి వేసి మ‌రో 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న చికెన్ సూప్ ఒక‌టిన్న‌ర క‌ప్పుల మోతాదులో వేసి క‌ల‌పాలి.

త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు బియ్యం వేసి క‌ల‌పాలి. పైన నుండి గులాబి రేకులు వేసి మూత పెట్టాలి. ఈ పులాన్ ను చిన్న మంట‌పై ఒక విజిల్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత మూత తీసి పైన రోజ్ వాట‌ర్ ను వేసుకోవాలి. త‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకుని వేడి వేడిగా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ ఎంతో రుచిగా ఉండే య‌ఖ్ని పులావ్ త‌యార‌వుతుంది. దీనిని వ‌ద్దూ అనకుండా ఇంకా కావాలని అడిగి మ‌రీ ఇష్టంగా తింటారు.

Tags: Yakhni Pulao
Previous Post

Bendakaya Pulusu : అమ్మ‌మ్మ‌ల కాలం నాటి స్టైల్‌లో బెండ‌కాయ పులుసును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Next Post

Turmeric Side Effects : ప‌సుపును అధికంగా తీసుకుంటే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌.. ఏం జ‌రుగుతుందంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.