Pooja Room : మనలో చాలా మంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం ఎన్ని పూజలు చేసిన ఉపయోగం లేదని అనుకుంటారు. దీనికి కారణం మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే. కాబట్టి మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా ఈ వస్తువులు మీ పూజ గదిలో ఉండాలని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులు కనుక మీ పూజ గదిలో లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసిన మీకు ఫలితం ఉండదంట. పూజ గదిలో ఏ వస్తువులు ఉంటే ఇంటికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఇలా కుదరని వారు తూర్పు లేదా ఉత్తర దిక్కులల్లో నిర్మించుకోవచ్చు. పూజగదిలో పొరపాటున కూడా రెండు శివలింగాలను ఉంచకూడదు.
అలాగే పూజ గదిలో ఉండే శివలింగం బొటన వేలు కంటే ఎక్కువ పరిమాణంలో ఉండకూడదు. పూజ గది విడిగా లేని వారు పూజ గదిలో పంచముఖ ఆంజనేయుని ఫోటో పెట్టకూడదు. పూజ గదికి అనుకుని బాత్ రూం ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక నెమలి పింఛాన్ని ఉంచుకోవాలి. పూజ చేసిన తరువాత నెమలి ఈకతో దేవుడికి గాలి విసిరి దేవుడికి సేవ చేయాలి. దేవుడి గదిలో చీకటి లేకుండా చూసుకోవాలి. పూజ గదిలో ఖచ్చితంగా పసుపు, కుంకుమ, అక్షింతలు ఉండాలి. పూజ గదిలో విరిగిపోయిన, పాడైపోయిన విగ్రహాలు, ఫోటోలు లేకుండా చూసుకోవాలి. వీటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసిన ప్రతిఫలం రాదు. పూజ గదిలో లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఉన్న చిత్రపటాని ఉంచాలి. ఇలాంటి పటాన్ని ఉంచడం వల్ల ఇంట్లోని వారికి అన్ని రంగాల్లో బాగా కలిసి వస్తుంది. డబ్బుకు కొరత ఉండదు. వ్యాపారం చేసే వారు అయితే మీరు వ్యాపారం చేసే చోట లక్ష్మీదేవి నిల్చొని ఉన్న చిత్రపటాన్ని ఉంచాలి.
ఇలా చేయడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే పూజ గదిలో రాధాకృష్ణుల ఫోటో ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం మంచిది. తాబేలు విగ్రహం ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. పూజ చేసేటప్పుడు రాగి చెంబులో బెల్లం నీళ్లు, తులసి ఆకులు వేసి పూజ చేయాలి. పూజ అనంతరం ఈ నీటిని తీర్థం లాగా తీసుకోవడం వల్ల జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. పూజ గదిలో గోమాత ఫోటోను ఉంచుకోవాలి. గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం ఇంట్లో ఉన్నట్టే. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఉగ్రరూపంలో ఉన్న నరసింహ ఫోటోను పూజ గదిలో ఉంచకూడదు.