Plants : వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈ మొక్క‌ల‌ను అస‌లు మీ ఇంట్లో పెంచ‌కూడ‌దు..!

Plants : చాలా మంది ఇండ్ల‌లో అనేక ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతుంటారు. కొంద‌రు ఇంట్లో మొక్క‌ల‌ను పెంచితే కొంద‌రు ఇంటి బ‌య‌ట పెంచుతారు. ఇక ఇంటి బ‌య‌ట స్థ‌లం లేక‌పోతే ఉన్న స్థ‌లంలోనే కుండీల్లో మొక్క‌ల‌ను పెంచుతారు. లేదా బాల్క‌నీ లాంటి ప్ర‌దేశాల్లోనూ మొక్క‌ల‌ను పెంచుతుంటారు. అయితే అంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ వాస్తు శాస్త్రం ప్ర‌కారం మ‌నం కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచ‌కూడ‌దు. వాటి వ‌ల్ల దోషం ఏర్ప‌డుతుంది. దీంతో ఇంట్లోని వారికి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. ఇక వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో పెంచుకోకూడ‌ని ఆ మొక్క‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొన్సాయి చెట్లు చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. వీటిని చాలా చిన్న సైజులో వ‌చ్చేలా పెంచుతారు. కానీ వాస్త‌వానికి వాస్తు ప్రకారం ఈ చెట్ల‌ను ఇంట్లో అస‌లు పెంచ‌కుకోకూడ‌ద‌ట‌. ఇవి చిన్న‌గా ఉంటాయి, అస‌లు పెర‌గ‌వు. అలాగే మ‌న అభివృద్ధి కూడా అలాగే ఉంటుంద‌ట‌. మ‌నం ఎలాంటి ప్ర‌గతిని ఎందులోనూ సాధించ‌లేమ‌ట‌. ఏ రంగంలోనూ మనం అభివృద్ధి చెంద‌లేమ‌ట‌. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్లుగా ఉంటుంద‌ట‌. క‌నుక బొన్సాయి చెట్ల‌ను అస‌లు ఇంట్లో పెంచుకోకూడ‌దు.

you should not grow these plants in your home according to vastu
Plants

ఇక ముళ్ల‌తో ఉండే కాక్ట‌స్ వంటి మొక్క‌ల‌తోపాటు ఇత‌ర ఏ మొక్క‌ల‌ను కూడా అస‌లు ఇంట్లో పెంచుకోకూడ‌దు. ముళ్ల‌తో ఉండే మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల మన జీవితంలో అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. అలాగే చింత చెట్టును కూడా పెంచ‌రాదు. ఇది నెగెటివ్ ఎన‌ర్జీని ఆక‌ర్షిస్తుంద‌ట‌. దుష్ట‌శ‌క్తులు ఎక్కువ‌గా చింత చెట్లపై ఉంటాయ‌ని చెబుతారు. క‌నుక ఈ చెట్ల‌ను కూడా ఇంట్లో పెంచ‌కూడ‌దు. అలాగే ఇంట్లో పెంచేందుకు ప‌త్తి చెట్లు కూడా అనువైన‌వి కావు. వాస్తు ప్ర‌కారం వీటిని ఇంట్లో పెంచితే దోషం ఏర్ప‌డుతుంద‌ట‌. అలాగే సైన్స్ ప్ర‌కారం చూసుకున్నా ప‌త్తి చెట్ల‌ను ఇంట్లో పెంచ‌కూడ‌దు. ఎందుకంటే ఇవి ఆస్త‌మా వంటి స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తాయ‌ట‌.

ఇక తుమ్మ చెట్లు లేదా న‌ల్ల తుమ్మ చెట్లు కూడా ఇంట్లో ఉండ‌డం మంచిది కాదు. ఇవి కేవ‌లం శ్మ‌శానాల్లోనే ఉంటాయి. ఇంట్లో వీటిని పెంచ‌కూడ‌దు. అలాగే రావి చెట్టు నెగెటివ్ ఎన‌ర్జీని ఆక‌ర్షిస్తుంది. క‌నుక ఈ చెట్ల‌ను కూడా ఇంట్లో ఉంచ‌కూడ‌దు. అదేవిధంగా గోరింటాకు చెట్ల‌ను కూడా పెంచుకోకూడ‌దు. ఇవి వాస్తు దోషం ఏర్ప‌డేలా చేస్తాయి. క‌నుక గోరింటాకు చెట్ల‌ను పెంచ‌రాదు.

Share
Editor

Recent Posts