మన శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాల్లో రాగి ఒకటి. ఇది మన శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అనేక జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. రాగి వల్ల మన శరీరానికి ఎంతగానో ఉపయోగం ఉంటుంది. రాగితో ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో, రాగి అందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడు యాక్టివ్‌గా పనిచేయాలంటే రాగి ఎంతో అవసరం అవుతుంది. దీని వల్ల మతిమరుపు సమస్య రాకుండా నివారించవచ్చు. రాగి వల్ల రక్తహీనత రాకుండా అడ్డుకోవచ్చు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో రాగి ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగి వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రాగి శరీరానికి వ్యాపించే ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది. అందువల్ల మనకు రాగి అవసరం ఉంటుంది.
మన శరీరంలో పలు క్రియల వల్ల ఫ్రీ ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి హానికరమైనవి. కణాలను దెబ్బ తీస్తాయి. కానీ తగినంత రాగి ఉంటే అది ఫ్రీ ర్యాడికల్స్ పై పోరాడుతుంది. దీంతో కణాలు సురక్షితంగా ఉంటాయి.
రాగి మన చర్మాన్ని సంరక్షిస్తుంది. మచ్చలను తొలగిస్తుంది. ముఖంపై ముడతలు ఏర్పడకుండా చూస్తుంది. గాయాలు త్వరగా మానేందుకు దోహదపడుతుంది.
రోజూ రాత్రి పూట రాగి పాత్రలో నీటిని పోసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. దీని ద్వారా మనకు రాగి లభిస్తుంది. ఇక పలు ఆహారాల్లోనూ రాగి ఉంటుంది. ఆలుగడ్డలు, చిలగడ దుంపలు, గుమ్మడికాయ విత్తనాలు, చియా సీడ్స్, పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, డార్క్ చాకొలెట్, మటన్ లివర్, ఆల్చిప్పలు, పుట్ట గొడుగులు, నువ్వులు, రొయ్యలు.. వంటి ఆహారాల్లో మనకు కాపర్ లభిస్తుంది. వీటిని తరచూ తినడం వల్ల రాగి అందుతుంది. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.