Copper : మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో రాగి ఒకటి. ఇది ఒక మినరల్. దీని వల్ల మన శరీరంలో పలు కీలక జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. రోజూ మనం తీసుకునే ఆహారాల్లో రాగి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
రాగి వల్ల మన శరీరంలో పలు జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. రాగితో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చేరే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
మన చర్మాన్ని రాగి సంరక్షిస్తుంది. శరీరంలోని అవయవాలకు ఐరన్‌ను చేరవేసేందుకు సహాయం అందిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రాగి వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. కనుక రాగి ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
రాగి మనకు ఎక్కువగా పలు రకాల ఆహారాల్లో లభిస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు, డార్క్ చాకొలెట్ వంటి వాటిలో మనకు రాగి లభిస్తుంది. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రాగి మనకు బాగా లభిస్తుంది. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
అయితే రాగిని మనం ఇంకో విధంగా కూడా అందేలా చూసుకోవచ్చు. మన పెద్దలు రాగి పాత్రల్లోని నీటిని తాగాలని అందుకనే చెబుతారు. రాగి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కనుక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. కనుకనే మన పెద్దలు రాగి పాత్రల్లో నీటిని తాగేవారు.
రాత్రంతా రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కూడా మనకు రాగి లభిస్తుంది. రాగి అణువులు నీటిలో సులభంగా కరుగుతాయి. దీంతో మనకు రాగి లభిస్తుంది. రాత్రి రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి మరుసటి రోజు మొత్తం ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగవచ్చు. దీంతో రాగి లభిస్తుంది. అలాగే పైన తెలిపిన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా రాగిని పొందవచ్చు. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు.