Calcium Deficiency : మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో కాల్షియం ఒకటి. విటమిన్ డి సహాయంతో కాల్షియం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. అయితే కాల్షియం లోపిస్తే మన శరరీంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం ఉన్న ఆహారాలను రోజూ తీసుకోకపోతే కాల్షియం ఏర్పడుతుంది. అలాగే కొన్ని రకాల మెడిసిన్లను వాడడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కనుక కాల్షియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ఇక ఈ లోపం ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కాల్షియం లోపిస్తే శరీరంలో ఎముకలు బలహీనంగా మారుతాయి. త్వరగా, సులభంగా విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎముకలు, దంతాలు తరచూ నొప్పిగా ఉంటాయి. అలాగే ఎముకలు గుల్లగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కాల్షియం లోపించడం వల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవు.
కాల్షియం లోపిస్తే కండరాలు పట్టేస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రించే సమయంలో కాలి పిక్కలు పట్టేస్తాయి. అలాగే కండరాల నొప్పులు కూడా ఉంటాయి. దీంతోపాటు చేతులు, కాళ్లలో స్పర్శ కొన్ని చోట్ల ఉండదు. కొన్ని చోట్ల సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. కాళ్లు, చేతుళ్లు తరచూ తిమ్మిర్లు పడుతుంటాయి.
తీవ్రంగా అలసిపోయే వారు, చిన్న పనికే బాగా అలసట, నీరసం వచ్చేవారు కాల్షియం లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. ఈ పోషక పదార్థం లోపించినా.. ఆయా లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కాల్షియం లోపించిన వారిలో గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. కొన్ని సార్లు మరీ వేగంగా, కొన్ని సార్లు మరీ తక్కువ వేగంగా గుండె కొట్టుకుంటుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే ముప్పు పెరుగుతుంది.
కాల్షియం లోపించిన వారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ వంటి కీళ్ల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నా.. కాల్షియం లోపం ఉందని అర్థం చేసుకోవాలి.
కాల్షియం లోపించిన వారి చర్మం పొడిగా మారుతుంది. దంతాలు క్షీణిస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. కనుక ఈ లక్షణాలు కనిపిస్తున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు మందులను వాడుకోవాలి. దీంతో కాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు.
ఇక కాల్షియం మనకు పలు పదార్థాల ద్వారా కూడా లభిస్తుంది. నట్స్, నారింజ, పాలు, చీజ్, కోడిగుడ్లు, పెరుగు, పాలకూర, చేపలు వంటి ఆహారాల ద్వారా మనకు కాల్షియం అధికంగా లభిస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు.