Omega 3 Fatty Acids : మన శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎంతో అవసరం. మన శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ఇవి ఒకటి. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. మెదడుకు శక్తిని ఇవ్వడంలో, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా మార్చడంలో, రోగ నిరోధక శక్తిని పెండచంలో ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో చేపలు ఒకటి. చేపలు, చేప నూనె ద్వారా మన శరీరానికి తగినంత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. అలాగే అవిసె గింజలు, చియా విత్తనాలు, బాదం పప్పు, ఆలివ్ నూనె లో కూడా ఈ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే వివిధ రకాల చిరు ధాన్యాల్లో కూడా ఈ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
మన శరీరానికి రోజుకు ఒకటి లేదా రెండు గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవసరమవుతాయి. అధికంగా శారీరక శ్రమ చేసే వారికి మూడు నుండి నాలుగు గ్రాముల ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన ఆహారాలను అందరూ తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా ఒంటికి పట్టకపోవచ్చు. ఆహారం ద్వారా తీసుకోలేని వారు వీటిని సప్లిమెంట్ ల రూపంలో అయినా తీసుకోవచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలు ఈ ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే వారిలో మానసిక ఎదుగుదల చక్కగా ఉంటుంది. మతిమురుపు, అల్జీమర్స్ వంటి వాటితో బాధపడే వారికి కూడా ఈ ఫ్యాటీ యాసిడ్లు ఎంతో మేలు చేస్తాయి.
సంతాన లేమితో బాధపడే వారు రోజూ ఆహారంలో భాగంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన ఆహారాలను లేదా క్యాప్సుల్స్ ను తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గి చక్కటి సంతానం కలుగుతుంది. స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన జుట్టు రాలడాన్ని కూడా తగ్గించి జుట్టును బలంగా, ధృడంగా చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి రక్త పోటును అదుపులో ఉంచుతాయి.
మానసిక సమస్యలతో బాధపడే వారు, నీరసంతో బాధపడే వారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు, కంటి చూపు తక్కువగా ఉన్న వారు ఈ ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆయా సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ విధంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను ప్రతి ఒక్కరను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.