వీటిని నెల రోజుల పాటు తీసుకోండి.. షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి..!

మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ప‌లు ఆహార ప‌దార్థాల్లో ల‌భిస్తాయి. వాటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

omega 3 fatty acids uses and their foods

1. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డిప్రెష‌న్‌, ఆందోళ‌న త‌గ్గుతాయి. సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

2. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. కంటి చూపును పెంచుతాయి.

3. గర్భిణీలు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పుట్టబోయే బిడ్డ‌ల్లో లోపాలు ఉండ‌వు. వారు ప్ర‌తిభావంతులుగా మారుతారు. ఎదుగుద‌ల లోపం ఉండ‌దు. మెద‌డు యాక్టివ్‌గా ఉంటుంది. సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల ద్వారా ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

4. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. శ‌ర‌రీంలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు.

5. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల వ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి.

6. వాపుల‌ను, ఆటో ఇమ్యూన్ వ్యాధుల‌ను త‌గ్గించేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వృద్ధాప్యం వ‌ల్ల వృద్ధుల్లో వ‌చ్చే అల్జీమ‌ర్స్ రాకుండా ఉంటుంది. క్యాన్స‌ర్లు, చిన్నారుల్లో ఆస్త‌మా రాకుండా ఉంటాయి.

7. లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉప‌యోగ‌ప‌డతాయి. ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

8. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌లో రుతు స‌మ‌య‌లో క‌లిగే నొప్పులు త‌గ్గుతాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేప‌లు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, బాదంప‌ప్పు, కోడిగుడ్లు, వాల్‌న‌ట్స్‌, బ్రొకొలి, కొత్తిమీర‌, అవిసె గింజ‌లు, చీజ్‌, ఆలివ్ ఆయిల్‌, అవ‌కాడో వంటి ప‌దార్థాల్లో మ‌న‌కు ల‌భిస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మన శ‌రీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. దీంతో పైన తెలిపిన స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

 

Share
Admin

Recent Posts