గుండె జబ్బులను నివారించేటందుకు ఎండు ఫలాలు అమోఘమైన ఫలితాలనిస్తాయి. వీటిలో కొలెస్టరాల్ ను తగ్గించే మంచి కొవ్వు వుంటుంది. ఆరోగ్యవంతమైన గుండె కొరకు ఏ రకమైన ఎండు ఫలాలను తీసుకోవాలో చూద్దాం. బాదం పప్పులు – ప్రతిరోజూ బాదం పప్పులు తినటం గుండెకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. కొల్లెస్టరాల్ నియంత్రణలో వుంటుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు ఆరోగ్యాన్నిస్తాయి. జీడిపప్పులు – ప్రతిరోజూ జీడిపప్పులు తింటే….డాక్టర్ అవసరమే వుండదనేది సామెతగా వస్తోంది.
జీడిపప్పులో ఓలెక్ యాసిడ్ వుంటుంది ఇది గుండెకు మంచి కొవ్వు. వీటిలో జింక్, కాపర్ మెగ్నీషియం, ఐరన్ మొదలైనవి వుండి ఎర్రరక్త కణాలను, గుండె కండరాలను బలపరుస్తాయి. పెకాన్స్ – వీటిలో విటమిన్లు అదికంగా వుండి రక్త నాళాలలో కొవ్వు డిపాజిట్లను కరిగిస్తుంది. గుండెకవసరమైన 15 రకాల విటమిన్లు వుంటాయి. విటమిన్లు ఎ,బి మరియు ఇ ఫోలిక్ యాసిడ్, మినరల్స్, కాల్షియం, పొటాషియం కూడా వుంటాయి. వీటిలో వుండే మెగ్నీషియం, జింక్ లు గుండెకు మాత్రమే కాక ఎముకలను, కండరాలను కూడా బలపరుస్తాయి.
పిస్తా: వీటిలో కావలసినంత పీచుపదార్ధముంటుంది. గుండెకు చాలా మంచిది. అధిక కొవ్వు కరిగిస్తుంది. కేన్సర్ ను నిరోధిస్తుంది. ప్రొటీన్లు వుండటం వలన మంచి ఎనర్జీ లభిస్తుంది. వాల్ నట్స్ – వీటిలో పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి. విటమిన్ బి 1,2,3,6 మరియు ఇ, మినరల్స్ అయిన కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఐరన్ వంటివి కూడా వుండి బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక కొల్లెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్ నట్ ను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.