Vitamin B12 : మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్ బి12 ఒకటి. దీన్నే మిథైల్ సయానో కోబాలమైన్ అంటారు. ఇది మన శరీరంలో డీఎన్‌ఏ ఇంకా ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉండే మెదడు, నాడీ కణాలకు విటమిన్ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అవి విటమిన్ బి12ను బాగా ఉపయోగించుకుంటాయి. అయితే విటమిన్ బి12ను మన శరీరం దానంతట అది తయారు చేసుకోలేదు. కనుక మనమే ఆహారాల ద్వారా ఈ విటమిన్‌ను శరీరానికి అందించాల్సి ఉంటుంది. ఇక ఈ విటమిన్ ఎక్కువగా మనకు జంతు సంబంధిత ఆహారాల నుంచి వస్తుంది. అయితే విటమిన్ బి12 లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ బి12 లోపించడం వల్ల మన శరీరంలోని జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని వల్ల అజీర్ణ సమస్య వస్తుంది. అలాగే శరీరానికి పోషకాలు లభించవు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. రక్తం బాగా తయారుకాదు. విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత మాత్రమే కాకుండా.. విసుగు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
విటమిన్ బి12 లోపిస్తే అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. దీనికి చికిత్స ఏమీ లేదు. ఇది వృద్ధుల్లో ఎక్కువగా వస్తుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాగే జ్ఞాపకశక్తి మొత్తం పోతుంది. అసలు దేన్నీ గుర్తుపెట్టుకోలేరు. ఆలోచించలేరు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, కంగారు, ఆందోళన, జీర్ణ సమస్యలు, చర్మం తెల్లగా పాలిపోయినట్లు అవడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయంటే.. వారిలో విటమిన్ బి12 లోపించినట్లేనని తెలుసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాలి. దీంతో వైద్యులు సమస్య ఉన్నట్లు తేలితే మందులను రాస్తారు. ముఖ్యంగా విటమిన్ బి12 ట్యాబ్లెట్లను రోజూ వేసుకోవాలని సూచిస్తారు. దీంతో విటమిన్ బి12 లోపం నుంచి బయట పడవచ్చు.
ఇక విటమిన్ బి12 లోపం రాకుండా ఉండాలంటే పలు ఆహారాలను రోజూ తీసుకోవాలి. మనం తినే కొన్ని ఆహారాల్లో విటమిన్ బి12 ఉంటుంది. కోడిగుడ్లు, చేపలు, మటన్, పుట్ట గొడుగులు వంటి వాటి ద్వారా విటమిన్ బి12 ను పొందవచ్చు. వీటిని తినడం వల్ల విటమిన్ బి12 సరిగ్గా లభిస్తుంది. దీంతో ఈ విటమిన్ లోపం రాకుండా ఉంటుంది. ఫలితంగా ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి విటమిన్ బి12 ఉండే ఆహారాలను తరచూ తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.