Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Vitamin D Deficiency : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే విట‌మిన్ డి లోపం ఉన్న‌ట్లే..!

D by D
April 17, 2023
in వార్త‌లు, విట‌మిన్లు
0
Share on FacebookShare on Twitter

Vitamin D Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎముక‌లను, దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఫ్లూ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, టైప్ 1 డ‌యాబెటిస్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, క్యాన్స‌ర్ అవ‌కాశాల‌ను త‌గ్గించ‌డంలో, ఒత్తిడిని మ‌రియు ఆందోళ‌న‌ను దూరం చేయ‌డంలో, శ‌రీరం పోష‌కాల‌ను చ‌క్క‌గా గ్ర‌హించేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఎండ‌లో కూర్చోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి ల‌భిస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నారు. విటమిన్ డి లోపించ‌డం వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అయితే కొన్ని ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌నం ముందుగానే విట‌మిన్ డి లోపాన్ని గుర్తించ‌వ‌చ్చు.

ఈ ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌నం ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది. విట‌మిన్ డి లోపం కార‌ణంగా మ‌న‌లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. విట‌మిన్ డి లోపం వ‌ల్ల నోటిలో మంట‌గా ఉండ‌డంతో పాటు నోరు తిమ్మిరిగా కూడా ఉంటుంది. తీవ్ర‌మైన నొప్పితో పాటు నోరు కూడా పొడిబారుతుంది. ఈ ప‌రిస్థితి ఉన్న‌టుండి రాదు. కాల‌క్ర‌మేణా నెమ్మ‌దిగా ఈ స‌మ‌స్య తీవ్ర‌మ‌వుతుంది. నోటిలో మంట‌తో పాటు నాలుక రుచి మార‌డం, నాలుక పూర్తిగా రుచిని కోల్పోవ‌డం, అలాగే నాలుక‌పై చిన్న చిన్న బొబ్బ‌లు రావ‌డం కూడా జ‌రుగుతుంది. అలాగే విట‌మిన్ డి లోపం కార‌ణంగా శ‌రీరంలో క్యాల్షియం స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే నాలుక స్ప‌ర్శ‌ను కోల్పోతుంది. విట‌మిన్ డి లోపం వ‌ల్ల నోరు పూర్తిగా ఎండిపోతుంది. నోరు ఎండిపోవ‌డం వ‌ల్ల దంతాల స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Vitamin D Deficiency can easily identified by tongue
Vitamin D Deficiency

విట‌మిన్ డి లోపం తీవ్ర‌మ‌య్యే కొద్ది ఇన్ ప్లామేష‌న్ తో పాటు న్యుమోనియా, శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది క‌నుక విట‌మిన్ డి లోపాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌డం చాలా అవ‌స‌రం. విట‌మిన్ డి లోపాన్ని అధిగ‌మించాలంటే మ‌నం రోజూ 10 నుండి 20 నిమిషాల పాటు ఎండ‌లో కూర్చోవ‌డం చాలా అవ‌స‌రం. అలాగే విట‌మిన్ డి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. పాల‌కూర‌, బెండ‌కాయ‌, సోయాబీన్స్, చేప‌లు, చేప నూనె, కోడిగుడ్లు, పాల ఉత్ప‌త్తులు, పుట్ట గొడుగులు, చీస్ వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి ల‌భిస్తుంది. ఈ ఆహారాల‌ను తీసుకుంటూ రోజూ ఎండ‌లో కూర్చోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డి లోపాన్ని మ‌నం చాలా సుల‌భంగా అధిగ‌మించ‌వ‌చ్చు.

Tags: vitamin d deficiency
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Meal Maker Curry : మీల్ మేక‌ర్‌ల‌ను ఇలా చేస్తే.. చికెన్‌, మ‌ట‌న్ కూడా ప‌నికిరావు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.