గుడ్డు పోషకాహారం అధికంగా వుండే పదార్ధాలలో ఒకటి. కాని కొల్లెస్టరాల్ కలిగిస్తుందంటూ చాలామంది వదలివేస్తారు. అయితే, గుడ్డు తో ఆహారం చేయటం అతి తేలిక. ఫ్రిజ్ లో ఎల్లపుడూ నిలువ వుంచుకుంటే, పిల్లలకు, పెద్దలకు ఎపుడు కావాలంటే అపుడు కొన్ని రకాల వంటకాలు గుడ్డుతో చేసుకోవచ్చు. పిల్లలు ఆకలి అంటూ సాయంత్రం ఇంటికి వచ్చినపుడు వాటితో ఎగ్ శాండ్ విచ్, లేదా కొన్ని వేపుడు కూరలతో కలిపి ఒక డిష్ గా చేసి ఇవ్వవచ్చు. ఇంటికి అనుకోని అతిధులు వస్తే, తేలికగా ఒక ఎగ్ క్రరీ లేదా ఎగ్ బిర్యాని చేసి అందించేయవచ్చు. ఎక్కువ సమయం పట్టదు.
గుడ్లు ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాలుగా ఆహారంగా ప్రసిద్ధి కెక్కాయి. ప్రతి కుటుంబ బడ్జెట్ కు సరిపోయే ఆహారం. వండటం తేలిక. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనంలో, రాత్రి భోజనంలో ఎక్కడైనా ఒక ఆహార పదార్ధంగా వాడటం తేలిక. గుడ్డు, ఒక జంతువునుండి వచ్చినప్పటికి చాలామంది శాకాహారులు కూడా దాని ప్రధాన పోషక విలువలకు గాను గుడ్డును తినటానికి ఇష్టపడతారు. ఉదయమే కనుక బ్రేక్ ఫాస్ట్ గుడ్డుతో తినేస్తే, కడుపు నిండుగా వుండి తర్వాత తినే ఆహారాలు తక్కువగా కూడా తింటారని అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్ధ తన పరిశోధనలో వెల్లడించింది.
కనుక అధికంగా తినే వారికి గుడ్డు తక్కువ తిని బరువు తగ్గించుకొనేటందుకు సహకరిస్తుందని కూడా చెపుతారు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.