వంకాయవంటి కూరయు…పంకజముఖి సీత వంటి భామామనియున్…..అంటూ వంకాయ మన వంటకాల్లో ఓ ముఖ్యమైన ప్లేస్ ను కొట్టేసింది.! అలాంటి వంకాయకు సంబంధించి మార్కెట్ లో రెండు రకాలు దొరుకుతున్నాయి. 1) గ్రీన్ కలర్ వంకాయలు 2) వైలెట్ కలర్ వంకాయలు. ఈ రెండిటిలో ఏది తింటే మంచిది? ఏది అంత శ్రేయస్కరం కాదు అనేది ఓ సారి తెలుసుకుందాం. ఒక్కమాటలో చెప్పాలంటే వైలెట్ కలర్ వంకాయ ది బెస్ట్.! ఇంకా చెప్పాలంటే…వైలెట్ కలర్ లో మనకు తినడానికి దొరికేవి రెండే రెండు 1) వంకాయ 2)నేరేడు …సో వైలెట్ కలర్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.!
గ్రీన్ తో పోల్చితే వైలెట్ కలర్ వంకాయ…పెరిగే క్రమంలో సూర్యుని నుండి అధిక కాంతిని గ్రహిస్తుంది. ! అధిక సూర్య రశ్మిని ఉపయోగించుకుంటూ పెరిగిన మొక్కల నుండి వచ్చే ఆహార పదార్థాలు తినడానికి చాలా శ్రేయస్కరం.!! ఇంకా వంకాయ విషయంలో చాలా అపోహలున్నాయి…వంకాయ వాతం, బరువు పెరుగుతారు అంటారు- కానీ వైలెట్ కలర్ వంకాయను కడుపునిండా తినొచ్చు. జొన్నరొట్టె, సజ్జ రొట్టె తో వంకాయ కూరను కలిపి తింటే చాలా మంచిది.
వంకాయ తినడం వల్ల కలిగే లాభాలు: క్యాన్సర్ ను అడ్డుకుంటుంది. బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది( 100 గ్రాముల వంకాయలో 25 కేలొరీస్ ). గుండె జబ్బులను నివారిస్తుంది ( ఫైబర్, పొటాషియం, విటామిన్ B-6 లు ఉండడం వల్ల హార్ట్ ఎటాక్స్ ను నివారించవొచ్చు). షుగర్ ను అరికడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. వంకాయలోని పోషక విలువలు. ( 100 గ్రాములకు ): కొవ్వులు 27.5 గ్రాములు, సంతృప్త కొవ్వులు 5.2 గ్రాములు, కొలెస్ట్రాల్ 16 మిల్లీగ్రాములు, సోడియం 62 మిల్లీగ్రాములు, పొటాషియం 618 మిల్లీగ్రాములు, పిండి పదార్థాలు 17.8 గ్రాములు, ఫైబర్ 4.9 గ్రాములు, ప్రోటీన్ 8 గ్రాములు, చక్కెరలు 11.4 గ్రాములు ఉంటాయి.