Rice: రైస్‌ను తినని వారుండరు.. అంటే అతిశయోక్తి కాదు. అనేక రకాల భారతీయ వంటకాల్లో రైస్ ఒకటి. చాలా మంది రైస్‌ను రోజూ తింటుంటారు. దక్షిణ భారతదేశవాసులకు రైస్ చాలా ముఖ్యమైన ఆహారం. అయితే రైస్‌లోనూ అనేక రకాల రైస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏది ఆరోగ్యకరమైనది ? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరుగుతారని వైద్యులు చెబుతుంటారు. అందువల్ల వైట్ రైస్‌ను తినడం తగ్గించాలి. వైట్ రైస్‌ను చాలా మంది తింటారు. ఇది రీఫైన్ చేయబడిన పదార్థం. ముడి బియ్యానికి పాలిష్ బాగా వేసి రైస్‌ను తెల్లగా మారుస్తారు. దీంతో అందులో ఉండే పోషకాలు నశిస్తాయి.
ఇక రైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్‌లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కనుక అవి ఆరోగ్యకరమైనవి అని చెప్పవచ్చు. ఇక వీటిల్లో భిన్న రకాల పోషకాలు ఉంటాయి కనుక అవి అందించే ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.
వైట్ రైస్
దాదాపుగా ప్రతి కుటుంబంలోనూ వైట్ రైస్‌ను ఎక్కువగా తింటారు. ఇందులో పోషకాలు ఏవీ ఉండవు. కానీ ఈ రైస్ శక్తిని అందిస్తుంది. అందువల్ల తక్షణ శక్తి కోసం వైట్ రైస్‌ను తినవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునేవారు, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ రైస్‌ను తినరాదు.
బ్రౌన్ రైస్
పాలిష్ చేయని ముడి బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. ఇందులో బియ్యంపై పొట్టు కొద్దిగా అలాగే ఉంటుంది. అందువల్ల వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, బి విటమిన్లు, మెగ్నిషియం, ఐరన్ ఉంటాయి. జింక్ కూడా ఈ రైస్‌లో ఉంటుంది. అయితే బ్రౌన్ రైస్‌ను తీసుకోవడం వల్ల మలబద్దకం ఉండదు. అధిక బరువును తగ్గించుకోవచ్చు. షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
రెడ్ రైస్
రెడ్ రైస్ గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ రైస్ కూడా మనకు మార్కెట్‌లో లభిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన రైస్ వెరైటీ. ఈ ధాన్యం గింజలే ఎరుపు రంగులో ఉంటాయి. వీటిల్లో యాంథో సయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్లే ఈ రైస్ ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రైస్ లోనూ పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ రైస్‌లో ఉండే ఫైబర్, ఐరన్ లు శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. హైబీపీ తగ్గుతుంది. బరువును తగ్గించుకోవచ్చు. షుగర్ ఉన్నవారు ఈ రైస్‌ను తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
బ్లాక్ రైస్
రెడ్ రైస్ లాగే బ్లాక్ రైస్ కూడా ఒక ప్రత్యేకమైన రైస్ వెరైటీ. ఇది చైనా వంటల్లో ఒక భాగంగా ఉంది. ఆ దేశ వాసులు ఈ రైస్‌ను ఎక్కువగా తింటారు. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, ఫైటో కెమికల్స్, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ రైస్‌ను అత్యంత పోషక విలువలు ఉన్న రైస్‌గా చెప్పవచ్చు. మిగిలిన అన్ని రైస్‌ల కన్నా ఈ రైస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని తరచూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
డయాబెటిస్, కొలెస్ట్రాల్, అధిక బరువు సమస్యలు ఉన్నవారు వైట్ రైస్ కాకుండా మిగిలిన 3 రైస్‌లను తినాలి. ఇక మిగిలిన వారు కూడా పోషకాలు అందాలంటే వైట్ రైస్ కాకుండా మిగిలిన రైస్‌లను తరచూ తీసుకోవచ్చు.