Grapes : మనలో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లుగా చెప్పవచ్చు. చాలా మంది వీటిని ఒక క్రమపద్దతిలో తినరు. ద్రాక్షలో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఒలిగో మెర్సిప్రోజెనిటార్ కణాల వంటివి సహజంగా ఉంటాయి. ద్రాక్ష ఒకరకమైన తీగ మొక్క. విత్తనాలు లేని ద్రాక్ష పండ్లే మనకు ఎక్కువగా కనబడతాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.
ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యానన్ని పొందవచ్చని వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలింది. ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితీరు పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడకుండా ఉంటాయి. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. నోరు, గొంతు ఇన్ ఫెక్షన్ లు కూడా తగ్గుతాయి. వీటిలో ఉండే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి పూర్తి రక్షణను ఇస్తాయి. ద్రాక్ష పండ్లను ఎండబెట్టి కిస్ మిస్ ల రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఇవి ఎండిన తరువాత కూడా వాటిలో ఉండే పోషకాలను కోల్పోకుండా ఉంటాయి.
ద్రాక్ష పండ్లల్లో ఉండే ఫాలిఫినాల్స్ కొలెస్ట్రాల్ ను అదుపు చేయడంలో, క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. వీటిలో కొవ్వు పదార్థాలతోపాటు సోడియం కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే విటమిన్ కె, విటమిన్ సి లు ద్రాక్షలో ఎక్కువగా ఉంటాయి. అరుగుదల శక్తి తక్కువగా ఉన్నవారికి సత్వర శక్తిని అందించే ఆహారాల్లో ద్రాక్ష ముఖ్యమైనది. ద్రాక్షపండ్లను తీసుకోవడం జీర్ణ శక్తి మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది. రోజూ కనీసం 350 గ్రాముల ద్రాక్ష పండ్లను తీసుకోవడం మంచిది.
అజీర్ణాన్ని కలిగించే పదార్థాలను ద్రాక్ష బయటకు నెట్టివేసి శరీరంలో వేడిని తగ్గించి అరుగుదలను పెంచుతుంది. ఆస్తమాను తగ్గించి ఊపిరితిత్తులను బలంగా తయారు చేసే గుణం కూడా ద్రాక్ష పండ్లకు ఉంటుంది. ప్రతిరోజూ ద్రాక్ష పండ్ల రసం తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయాన్ని ఉత్తేజపరచడంలో, పైత్యరసాన్ని సరిగ్గా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో ద్రాక్ష పండ్లు మనకు ఎంతగానో సహాయపడతాయి. పిల్లల్లో దంతాలు వచ్చేటప్పుడు ఎదురయ్యే సమస్యలకు ద్రాక్ష పండ్ల రసం మంచి ఔషధం.
చీము పట్టిన దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడే వారు ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గి దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. ద్రాక్ష పండ్ల రసాన్ని తాగడం అలవాటు చేసుకోవడం వల్ల క్రమేపి ఆల్కాహాల్ మీద ఆశ తగ్గడంతో పాటు ద్రాక్షలోని పోషకాలను కూడా పొందవచ్చు. వయసు మీద పడడం వల్ల వచ్చే కంటి సమస్యలను తగ్గించి చూపును మెరుగుపరచడంలో కూడా ద్రాక్ష పండ్లు ఉపయోగపడతాయి. తలనొప్పితో బాధపడే వారు ద్రాక్ష పండ్లను తినడం వల్ల నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
ఎముకలను దృఢంగా ఉంచడంలో, శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో కూడా ద్రాక్ష పండ్లు మనకు తోడ్పడుతాయి. ద్రాక్ష పండ్లను తరచూ తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తాజా ద్రాక్ష పండ్లను గుజ్జుగా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ద్రాక్ష పండ్లను స్క్రబర్ల తయారీలో, మాయిశ్చరైజర్ ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ద్రాక్ష పండ్లు వయసు పైబడడం వల్ల చర్మం పై వచ్చే ముడతలను సమర్థవంతంగా తొలగిస్తాయి. ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.