Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

Black Guava : మీకు న‌ల్ల జామ‌కాయ‌ల గురించి తెలుసా.. వీటిని తింటే ఏం జ‌రుగుతుందంటే..?

D by D
July 9, 2023
in పండ్లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Black Guava : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామ పండ్లు కూడా ఒక‌టి. జామ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అంద‌రూ ఈ జామపండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. జామ పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వైద్య నిపుణులు కూడా జామ‌పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే సాధార‌ణంగా ఆకు ప‌చ్చ రంగులో ఉండి లోప‌ల తెలుపు మ‌రియు లైట్ పింక్ రంగుల్లో గుజ్జును క‌లిగి ఉంటాయి. ఇవి అంద‌రికి తెలిసిన‌వే. అయితే ఇవే కాకుండా జామ‌కాయ‌ల్లో మ‌రో ర‌కం కూడా ఉంటుంది. అవే న‌ల్ల జామ‌కాయ‌లు. అవును జామ‌కాయ‌ల్లో న‌ల్ల జామ‌కాయ‌లు కూడా ఉంటాయి. ఇవి పైన న‌ల్ల‌గా లోప‌ల ఎర్ర‌టి రంగులో గుజ్జును క‌లిగి ఉంటాయి.

అలాగే ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాండం కూడా న‌లుపు రంగులోనే ఉంటుంది. ఈ న‌ల్ల జామ‌కాయ‌ల గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఇత‌ర జామ‌కాయ‌ల వ‌లె ఈ న‌ల్ల జామ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధార‌ణ జామ‌కాయ‌ల కంటే వీటిలో పోష‌కాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. ఈ న‌ల్ల జామ‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌రల్స్, పీచు ప‌దార్థాల‌తో పాటు విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. న‌ల్ల జామకాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు.

Black Guava health benefits in telugu take them daily
Black Guava

అలాగే ఈ జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. పోష‌కాహార లోపం త‌లెత్తకుండా ఉంటుంది. అలాగే చ‌ర్మ‌ ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా చేయ‌డంలో కూడా ఈ జామ‌కాయ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. న‌ల్ల జామ‌కాయ‌ల్లో పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. అదే విధంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ న‌ల్ల జామ‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ జామ‌కాయ‌ల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఇది ఎర్ర ర‌క్త‌క‌ణాలు ఎక్కువ‌గా త‌యారయ్యేలా చేసి రక్త‌హీన‌తను త‌గ్గించ‌డంలోదోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు త‌ర‌చూ ఈ పండ్ల‌ను తినాలి. ఇక వీటిని తింటే బ‌రువు కూడా త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు.  ఈ విధంగా న‌ల్ల జామ‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని ఇత‌ర జామ‌కాయ‌ల వ‌లె వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Black Guava
Previous Post

Gutti Vankaya Vepudu : ఆంధ్రా స్టైల్‌లో గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Next Post

Veg Omelette : కోడిగుడ్లు లేకుండా వెజిట‌బుల్ ఆమ్లెట్‌.. ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.