Blueberries : బ్లూ బెర్రీస్.. ఈ పండ్లను మనలో చాలా మంది చూసే ఉంటారు. మన దేశంలో తాజాగా చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. ఇతర దేశాల్లో వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నప్పటికి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేయడంలో యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎంతో ఉపయోగపడతాయి.
100 గ్రాముల డ్రై బ్లూబెర్రీస్ లో 15 గ్రాముల నీటి శాతం, 319 కిలో క్యాలరీల శక్తి, 67.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల ప్రోటీన్, 2.4 గ్రాముల కొవ్వులు, 7.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ పండ్లు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 50 గ్రాముల బ్లూబెర్రీలను తీసుకోవడం వల్ల సహజంగానే అధిక రక్తపోటు 10 శాతం మేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో బ్లూబెర్రీలు అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బ్లూబెర్రీలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే బరువు తగ్గడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో ఈ పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మంపై ఉండే ముడతలు తొలగిపోతాయి. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా బ్లూబెర్రీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని పండ్ల రూపంలో లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎలా తీసుకున్నా కూడా మనకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.