పండ్లు

Pears : ఈ పండు దొరికితే అసలు వదలకండి..! ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇది అద్భుతమైన ఆహారం..!

Pears : ఈ పండు మనకి వర్షాకాలంలో అధికంగా లభిస్తుంది. ప్రజలు ఈ పండును తినడానికి పెద్దగా ఆసక్తి చూపించ‌రు. కానీ దీనిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఆరోగ్య ప్రేమికులు ఎవరూ తినకుండా ఉండలేరు. ఆ పండే పియర్స్. ఈ పియర్స్ ను తెలుగులో బేరి పండు అంటారు. యాపిల్ కంటే ఎక్కువ తియ్యగా, ఎక్కువగా ఫైబర్ ఉండే పండు ఇది. అంతేకాకుండా దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా పోషకాలు కలిగి ఉంటాయి. అధిక బరువు ఉన్నవాళ్లు ఈ పండ్లు తినడం వల్ల ఫైబర్ శరీరానికి అందుతుంది.

అంతేకాకుండా డయాబెటిస్ పేషెంట్లు కూడా పియర్స్ ను చక్కగా తినవచ్చు. డయాబెటిస్ పేషెంట్స్ లో చక్కెర స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహకరిస్తుంది. ఈ పండులో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్, విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం, కాపర్, ఫైబర్, ఫోలేట్ తదితర పోషక విలువలు పియర్స్ లో అధికంగా ఉంటాయి. అందువల్ల, రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి హిమోగ్లోబిన్ స్థాయిల‌ని పెంచడమే కాకుండా ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో కూడా సహాయపడే పోషకాలు ఈ పండ్ల‌లో పుష్కలంగా ఉంటాయి. ఈ పండును నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఎంతో శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు.

do not forget to take pears in this season do not forget to take pears in this season

ఈ పండ్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా కూడా ఉంచుతాయి. పియర్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా పియర్స్ పండ్లను తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా బరువును నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతాయి. ఈ పండులో ఉండే పోషక విలువలు వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. క‌నుక ఏ విధంగా చూసుకున్నా కూడా అనేక అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి కాబ‌ట్టి ఈ పండ్ల‌ను తిన‌డం అస‌లు మిస్ చేసుకోకండి.

Admin

Recent Posts