Pomegranate : దానిమ్మ గింజ‌ల‌తో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Pomegranate : ఎర్ర‌గా, కంటికి ఇంపుగా క‌నిపిస్తూ చూడ‌గానే తినాల‌నిపించే దానిమ్మ పండును మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దానిమ్మ పండ్లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి మ‌న‌కు దాదాపుగా అన్నీ కాలాల్లోనూ ల‌భిస్తూ ఉంటాయి. దానిమ్మ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దానిమ్మ గింజ‌ల‌ను నేరుగా తిన‌వ‌చ్చు. జ్యూస్ గా చేసుకుని కూడా తాగ‌వ‌చ్చు. వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో గార్నిష్ కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ దానిమ్మ గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ‌ను అత్యంత శ‌క్తివంతంమైన యాంటీ ఆక్సిడెంట్ల స‌మాహారంగా నిపుణులు చెబుతుంటారు. ఇవి క‌ణాల విధ్వంసానికి కార‌ణ‌మ‌య్యే ఫ్రీ రాడిక‌ల్స్ ను అంతం చేసి వృద్ధాప్యం రాకుండా అడ్డుకుంటాయి. అల్జీమ‌ర్స్, రొమ్ము క్యాన్స‌ర్, చ‌ర్మ క్యాన్స‌ర్ వంటి అనారోగ్యాల‌ను ఎదుర్కొనే శ‌క్తి దానిమ్మ‌కు ఉంది. దానిమ్మ‌లో స‌హ‌జ సిద్ద‌మైన ఆస్ప్రిన్ ఉంటుంది. ఇది ర‌క్త‌స‌ర‌ఫ‌రాను వేగ‌వంతం చేస్తుంది. ప్ర‌తిరోజూ పావు క‌ప్పు దానిమ్మ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలే ఉండ‌వు. ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు కూడా ధృడంగా ఉంటాయి. ఆస్ట్రియో ఆర్థ‌రైటిస్ వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారికి దానిమ్మ జ్యూస్ దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. దానిమ్మ స‌హ‌జ సిద్ద‌మైన వ‌యాగ్రా కూడా ప‌ని చేస్తుంద‌ని నిపుణులు జ‌రిపిన ఆధ్య‌య‌నాల్లో తేలింది. అంగ‌స్థంబ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే శ‌క్తి దానిమ్మ‌కు ఉంది.

do not forget to take Pomegranate regularly or else you loose these benefits
Pomegranate

సంతాన సాఫ‌ల్య‌త‌ను పెంచే గుణం కూడా దానిమ్మ‌కు ఉంద‌ని పలు ప‌రిశొధ‌న‌ల ద్వారా నిరూపితమైంది. అలాగే గ‌ర్భ‌స్థ శిశువుల‌కు అత్యంత అవ‌స‌ర‌మైన ఫోలిక యాసిడ్ దానిమ్మ పండులో పుష్క‌లంగా ల‌భిస్తుంది. క‌నుక గ‌ర్భిణీ స్త్రీలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ ను తాగితే మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల నెల‌లు నిండ‌కుండా ప్ర‌స‌వం అయ్యే ముప్పు కూడా త‌గ్గుతుందని వారు చెబుతున్నారు. అలాగే ఈ జ్యూస్ ను త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల వ‌య‌సు పెరిగే కొద్ది చ‌ర్మం పై వ‌చ్చే ముడ‌త‌లు రాకుండా నిత్య య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. నీళ్ల విరోచ‌నాల‌తో బాధ‌ప‌డే వారు దానిమ్మ జ్యూస్ ను తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. దానిమ్మ‌లో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి.

ఇవి నోటిపూత నుండి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి. అల్స‌ర్ల‌ను నివారిస్తాయి. దంతాల‌ను, చిగుళ్ల‌ను కూడా గ‌ట్టిప‌రుస్తాయి. మ‌హిళల్లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పిని, ఒత్తిడిని త‌గ్గించే గుణం దానిమ్మ‌లో అధికంగా ఉంది. దానిమ్మ జ్యూస్ గుండెకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దానిమ్మ జ్యూస్ ను రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ క‌రిగిపోయి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. దానిమ్మ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్త‌నాళాలు మూసుకుపోకుండా ఉంటాయి. అధిక ర‌క్త‌పోటు ఉన్న వారికి, గుండె జ‌బ్బులు ఉన్న వారికి దానిమ్మ జ్యూస్ మేలు చేస్తుంది. మూత్ర పిండాల స‌స‌మ‌స్య‌ల‌ను కూడా దానిమ్మ జ్యూస్ నివారిస్తుంది.

జీర్ణ‌క్రియ‌ను కూడా ఈ జ్యూస్ మెరుగుప‌రుస్తుంది. దానిమ్మ గింజ‌ల‌ను తిన‌డం కంటే వాటిని జ్యూస్ గా చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని, వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts