ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్రూట్స్‌ని కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఎక్కువ మంది డ్రాగన్ ఫ్రూట్‌ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. రోడ్డుపక్కనే తోపుడు బండ్లపై అమ్ముతున్నారు. ఇది మన ఆరోగ్యానికి మంచిదేనా, దీని వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది చూస్తే.. డ్రాగన్ ఫ్రూట్‍లో మంచి పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్, కేలరీలు, ఐరన్ కంటెంట్, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం ఇందులో ఉంటాయి.మనిషి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి ఫైబర్ ఎంతో అవసరం. ఈ పీచు పదార్థం డ్రాగన్ ఫ్రూట్లో పుష్కలంగా ఉంటాయి.
ఇదేకాకుండా.. ఐరన్, జింక్, మాంసకృత్తులు, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఈ పండులో దండిగా ఉంటాయి. నీరసంగా ఉన్నవారు.. ఆ పరిస్థితి నుంచి వెంటనే తేరుకోవాలంటే.. డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కొన్ని తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.ఇది పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పార్కిన్సన్స్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఒక డ్రాగన్ ఫ్రూట్‌లో 102 కేలరీల శక్తి ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం. ఒక డ్రాగన్ ఫ్రూట్‌లో 22 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో 13 గ్రాముల చక్కెర కూడా ఉంటుంది. మరో మంచి విషయం ఏమిటంటే డ్రాగన్ ఫ్రూట్‌లో కొవ్వు ఉండదు. అందువల్ల, హార్ట్ పేషెంట్ కోసం డ్రాగన్ ఫ్రూట్ గుండె రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
డ్రాగన్ ప్రూట్ గింజల్లో ఒమేగా-3 ,ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె కణాలను బలపరుస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు నియంత్రణకు కూడా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం మేలు చేస్తుంది.ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ముఖ కాంతిని పెంచుతుంది. చర్మ సౌందర్యానికి రోజూ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది.ఈ పండులో విటమిన్ బి, ఫోలేట్, ఐరన్ ఉంటాయి. గర్భిణీలు ఈ పండును తినడం మంచిది. ఈ పండు తినడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది.కంటికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఈ పండును రోజూ తీసుకోవడం మంచిది.