మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. ఇది ఒకప్పుడు చైనా నుంచి దిగుమతి అయ్యేది. కానీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్‌ను మన దేశంలోనూ పండిస్తున్నారు. దీన్ని చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. పైన తొడిమలు ఉంటాయి. లోపల తెల్లగా నల్లని విత్తనాలను కలిగి ఉంటుంది. ఇది భలే రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రాగన్ ఫ్రూట్‌ను తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ బరువు తగ్గాలనుకునేవారికి ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ పండ్లలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఈ పండ్లలో ఉండే మెగ్నిషియం మనసును ప్రశాంతంగా మారుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
ఈ పండ్లను తినడం వల్ల హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌ను నేరుగా తినవచ్చు. లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కనుక దీన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.