Grapefruit : నిమ్మజాతికి చెందిన వివిధ రకాల పండ్లల్లో దబ్బపండు కూడా ఒకటి. దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు, బయో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చూడడానికి పెద్ద నిమ్మకాయలుగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అలాగే వీటితో పచ్చడి, పులిహోర, షర్బత్ వంటి వాటిని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఇతర నిమ్మజాతికి చెందిన పండ్ల వలె దబ్బపండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీంతో మనం దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. బరువు తగ్గాలనుకునే వారు ఈ దబ్బపండును ఆహారంలో భాగంగా తీసకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ పండును ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడే వారు దబ్బపండును ఉపయోగించడం వల్ల సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఈ పండును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. దబ్బకాయను ఉపయోగించడం వల్ల మనం నోటిపూత, దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. ఈ దబ్బకాయను మనం నిమ్మకాయకు, చింతపండుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించవచ్చు. దబ్బకాయను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వాత, కఫ దోషాలను తొలగించడంలోఈ పండును ఎక్కువగా ఉపయోగిస్తారు. తేనెటీగ కుట్టినప్పుడు ఈ పండు రసాన్ని కుట్టిన చోట రాయడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ పండును తీసకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి.
కండరాలు మరియు కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. దబ్బకాయను ఉపయోగించడం వల్ల కాలేయం, గుండె, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా దబ్బకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని కూడా ఇతర నిమ్మజాతికి చెందిన పండ్లను తీసుకున్నట్టే ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.