సాధారణంగా పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ ఏదో ఒక పండును తినటం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి. అయితే అన్ని కాలాల్లోనూ అన్ని రకాల పండ్లు మనకు దొరకవు కనుక కాలాలకు అనుగుణంగా ఆ సీజన్లో దొరికే పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ క్రమంలోనే కమలా పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఉండే పోషక విలువలు మన శరీరానికి అందడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. ఈ సీజన్ లో దొరికే కమలాపండులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గాలనుకొనే వారికి కమలాపండ్లు ఎంతగానో దోహదపడతాయి.
2. అధిక చక్కెర వ్యాధి సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక కమలా పండును తినడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా కమలాపండులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది.
3. కమలా పండులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా కండరాలు కూడా గట్టిపడతాయి. ఇక ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
4. ఈ సీజన్ లో దొరికే కమలాపండును తినడం వల్ల కేవలం ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. నిత్యం కమలా పండును తినడం వల్ల చర్మంపై ఏర్పడే ముడతలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా, యవ్వనంగా కనబడుతుంది.
5. కమలాపండు తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల ముఖంపై పేరుకుపోయే దుమ్ము, ధూళి కణాలు తొలగిపోయి ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.