Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

How To Eat Kiwi Fruit : కివి పండు ఎలా తినాలి

Editor by Editor
July 23, 2024
in పండ్లు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

How To Eat Kiwi Fruit : మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భించే పండ్ల‌లో కివి పండు కూడా ఒక‌టి. ఇది చూసేందుకు గోధుమ రంగులో ఉంటుంది. కానీ లోప‌ల ఆకుప‌చ్చ‌గా న‌ల్ల‌ని విత్త‌నాల‌ను క‌లిగి ఉంటుంది. సాధార‌ణంగా దీన్ని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే కివి పండు పుల్ల‌గా ఉంటుంది. అందుక‌ని దీన్ని తిన‌లేరు. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు త్వ‌ర‌గా కోలుకునేందుకు చాలా మంది కివి పండ్ల‌ను తింటుంటారు. కివి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కివి పండ్ల‌లో క్యాలరీలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఒక మీడియం సైజ్ కివి పండును తింటే మ‌న‌కు దాదాపుగా 39 క్యాల‌రీలే ల‌భిస్తాయి. ఈ పండ్ల‌లో ప్రోటీన్లు, కొవ్వులు చాలా త‌క్కువ‌గా, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి.

కివి పండ్ల‌లో కార్బొహైడ్రేట్లు, ఫైబ‌ర్‌, పొటాషియం, విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉంటాయి. రెండు చిన్న‌పాటి కివి పండ్ల‌ను తింటే మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. అలాగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆస్త‌మా నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ద‌గ్గు, జలుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది. ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
How To Eat Kiwi Fruit in telugu with cleaning
How To Eat Kiwi Fruit

కివి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం సైతం మెరుగు ప‌డుతుంది. ఈ పండ్ల‌ను తింటే మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. అలాగే ట్రై గ్లిజ‌రైడ్స్ కూడా త‌గ్గుతాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇది హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముప్పును తగ్గిస్తుంది. క‌నుక రోజూ ఒక కివి పండును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక ఈ పండ్ల‌ను తింటే ఫైబ‌ర్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

ఇలా తినాలి..

కివి పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక విట‌మిన్లు ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్లు సి, ఇ, కెల‌తోపాటు ఫోలేట్ కూడా స‌మృద్ధిగానే ఉంటుంది. అందువ‌ల్ల కివి పండ్ల‌ను తింటే మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే కివి పండ్ల‌ను నేరుగా తిన‌లేమ‌ని అకునేవారు వాటిని పొట్టు తీసి ఉడికించి తిన‌వ‌చ్చు. లేదా వాటిని పొట్టు తీసి వాటిపై కాస్త ఉప్పు చ‌ల్లి తిన‌వ‌చ్చు. దీంతో పులుపుద‌నం త‌గ్గుతుంది. కివి పండ్ల‌ను పొట్టుతో తిన్నా కూడా లాభాలే క‌లుగుతాయి. అలాగే ఈ పండ్ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి ఇత‌ర పండ్ల‌లో క‌లిపి కూడా తిన‌వ‌చ్చు. దీంతో పుల్ల‌ని రుచి త‌గ‌ల‌కుండా ఉంటుంది. ఇలా కివి పండ్ల‌ను మ‌నం ప‌లు ర‌కాలుగా తిన‌వ‌చ్చు.

Tags: How To Eat Kiwi Fruit
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Immunity Increasing Foods : ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు.. వీటిని రోజూ తినండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.